Archive for the ‘ మీకు తెలుసా ’ Category

జైగోవింద జైజై భాష్యకార శ్రీమతే రామానుజాయ నమః ప్రియ భగవద్బంధువులకు దాసోహములు
ఈరోజు 108 దివ్య దేశములలో చోళనాడు తిరుపతులలో మెుదటిది అయినటువంటి “శ్రీరంగం ” మూడవ భాగం తెలుసుకుందాం.

శ్లో:కావేరి పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే
  చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే|
  వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే
  దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రజ్గనాధం భజే||

ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారుల కీర్తిస్తారు. మన పెద్దలు ప్రతి దినం “శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ” అని అనుసంధానము చేస్తుంటారు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము

శ్రీరంగం గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది అది “అనంతం”.
ఈనాడు శ్రీరంగం గురించి అక్కడ వేంచేసి ఉన్న సమస్త అర్చామ్మూర్తులకు మూలమైన రంగనాధ పెరుమాళ్ గురించి కొన్ని విశేషాలు చూద్దాము.

అసలు స్వామీ అక్కడకు వేంచేయడానికి సంభందించిన వృత్తాన్తమ్ చూద్దాము.

రంగనాధుడే అన్ని అర్చామూర్తులకు మూలమైనవాడు అంటున్నాము కదా!అదేంటి అలా అనడంలో అర్ధం ఏంటి తిరుమల శ్రినివాసుడినో?లేదా  మరిఒక దివ్యదేశంలో ఉండే స్వామిని ఎందుకు కాకూడదు అంటే?మొట్టమొదటిగా విగ్రహరూపంలో ఈ భూలోకంలో ఆవిర్భవించనవారు పాలకడలిలో ఉండే స్వరూపంతోటి మొదటగా వేంచేసినవారు  రంగనాధుడు కాబట్టి వారే ప్రధములు,వారే మూలము.

పరమాత్మ సృష్టి చెయ్యాలని సంకల్పించిన తరవాత మొదటగా చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మకు సృష్టి చేయుటకు కావాల్సిన జ్ఞానాన్ని సహకారికములను అన్ని ఇవ్వగా,బ్రహ్మ తాను నిత్యం ఆరాధించుకోవడానికి ఒక అర్చామూర్తిని ఇవ్వమని ప్రార్ధించగా, అంతట స్వామి ఐదు తలల ఆదిశేషుడిపై శయనించిన శ్రీరంగనాథుని విగ్రహాన్ని శ్రీరంగవిమానంతో బ్రహ్మకు బహుకరిస్తారు. సత్యలోకంలో దానిని ప్రతిష్టించి అప్పటినుండి బ్రహ్మ రంగనాధుడిని భక్తి శ్రద్దలతో పూజించేవారు. బ్రహ్మ గారు అర్చామూర్తికి ఎటువంటి అపచారములు జరగకుండా చూసుకునే భాద్యతను సూర్యునకు అప్పగించి ఆరాధనలు జరిగేవి.బ్రహ్మగారి  కుమారుడు మనువు కూడా తరవాతి పరంపరలో రంగనాధుడిని ఆరాధించేవారు. మనువు కుమారుడగు ఇక్ష్వాకు శ్రీమన్నారాయణుడి పరమ భక్తుడు. అతడు ఎలాగైనా సరే శ్రీరంగవిమానాన్ని సంపాదించి భూలోకంలో తన నివాస స్థలంలో ప్రతిష్టించి తలచి బ్రహ్మగారి గురించి కఠోర తపస్సు చెయ్యగా,ఇంతలో బ్రహ్మ గారు ప్రత్యక్షం అవ్వగానే తన కోరికను విన్నవించగా, శ్రీమన్నారాయణుడు కూడా ప్రత్యక్షమై రిక్షావాకు కోరికను మన్నించి,శ్రీరంగ విమానాన్ని ఇవ్వమని చెప్పగా,బ్రహ్మ తాని శ్రీరంగడుని విడిచి ఉండలేనని చెబుతాడు. శ్రీమన్నారాయణుడు ఇలా బ్రహ్మను కటాక్షిస్తారు ” తాను సరియు నదీతీరంలో అయోధ్యలో ఉనంతవరకు బ్రహ్మను ప్రాతఃకాలమున అర్చించమని, తాను శ్రీరంగమునకు వెళ్లిన తరువాత మాంద్యానిక సమయములో ఆరాధించామని”చెప్పగా, అందుకు బ్రహ్మ సరేనని శ్రీరంగవిమానంతో సహా శ్రీరంగనాధుడిని ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తారు. ఇలా భూలోకమునకు వేంచేసిన రంగనాధుడు శ్రీరామచంద్రుని వరకు సూర్యవంశపు రాజుల యొక్క ఆరాధనను స్వీకరిస్తాడు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో అందరికి అన్ని కానుకలు ఇవ్వగా,రాముడిని విడిచి వెళ్లలేని స్థితిలో ఉన్న విభీషనుడికి రాముడు వారి ఆరాధ్యదైవమైన రానగనాధుడిని బహుకరిస్తారు. అత్యంత ఆనందముతో విభీషణుడు ఆ రంగ విమానాన్ని తన శిరస్సుపై దాల్చి తన లంకకు పయనం అవ్వగా, ఉభయ కావేరుల మధ్య స్థావరమునకు రాగానే మాధ్యాహ్న సమయం అయినందున నిత్యానుష్టానులు చేయదలచి శ్రీరంగ విమానమును చంద్రపుష్కరిణి సమీపంలో  రమణీయమైన స్థానంలో ఉంచి తాను సంధ్యావందనాదులు చేయుటకు వెళ్లెను . అదే “శేషపీఠం”. అనుష్టానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చి చుసిన విభీషనుడికి రంగనాధుడు అక్కడ సుప్రతిష్ఠమైనట్టుగా తెలిసి అత్యంత విచారం పొందాడు. విభీషణుడి బాధను చుసిన స్వామి సాక్షత్కారం ఇచ్చి నీవు చింతించవలదు,భక్తుల యొక్క ప్రార్ధన మేరకు నేను ఇక్కడ వేంచేసితిని,అని తెలిపి నీవు నిత్యమూ రాత్రి వేళల వచ్చి నన్ను ఆరాధించుకో స్వీకరిస్తాను అని అభయం ఇచ్చాడు.

స్వామి ఈ ప్రాంతంలోనే ఎందుకు సుప్రతిష్ఠుడైయ్యాడు?అని అంటే.

అయోధ్యలో పూర్వం దశరథమహారాజుగారు పుత్రకామేష్టి యాగం చేస్తున్న సమయంలో ఆ యాగాన్ని దర్శించడానికి వచినటువంటి మహారాజులలో ఒకరైన చోళదేశాన్ని పాలిస్తున్న ధర్మవర్మ అనేటువంటి మహారాజు కూడా వచ్చాడు. ఆ యాగ శాల యందు వేంచేసి ఉన్నటువంటి శ్రీరంగవిమానాన్ని చూసి అత్యంత ప్రీతికలిగినవాడై ఆ స్వామిని తన నివాసస్థానములో ఉంచుకుని అత్యంత భక్తిశ్రద్దలతో ఆరాధించాలనుకున్నాడు. ఆ కోరికటి ధర్మవర్మ మహారాజు చంద్రపుష్కరిణి తీరంలో స్వామిని గూర్చి తపస్సు చెయ్యడం ప్రారంభించగా, మహర్షులు ధర్మవర్మతో ఇలా చెప్పసాగారు అతితొందరలో శ్రీరంగనాథుడు తన నివాస ప్రదేశమునకు శ్రీరంగవిమానముతో సహా వేంచేస్తునాడు అని తెలపగా,అత్యంత ఆనందభరితుడై స్వామి ఈ దీనుడిని కటాక్షించారు అని పొంగిపోయి.అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీరంగవిమానమునకు చుట్టూ ప్రాకారములు ఏర్పరిచి నిత్యా పూజాదికములు క్రమంతప్పకుండా నిర్వహిస్తూ తరించారు.
ధర్మవర్మ మహారాజు తరువాతి పరంపరలో వచినటువంటి వారు అత్యంత రమణీయంగా గోపుర ప్రాకారాదులు నిర్మింప చేశారు.కానీ కొంత కాలం పరంపర లేకుండా ప్రకృతి యొక్క భీబత్సం చే కప్పబడి ఒక దండకారణ్యమునకు నివాసముగా అయిపోయింది. తరవాత చోళరాజ్య పరంపరలో ఉన్నటువంటి రాజుకు ఒక చిలుక యొక్క వాక్కులచేత రంగనాధడిని వైభవాన్నిశ్లోక రూపంగా  వింటూ

“శ్రీ ధర్మ వర్మ రవివర్మ నిషేవితాజ్గ:
  శ్రీరజ్గిణీ చటుల విభ్రమ లోల నేత్ర: |
  నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి
  పాత్రం విరాజితి విభీషణ భాగధేయ: ||”

ఆ శబ్దముద్వారా ప్రయాణిస్తూ రంగనాధుడు తన స్వప్నంలో చూపించనట్టి చోటుకు చేరుకొని చింతించి తిరిగి పునరుద్ధరణ చేశారు.ఇలా స్వామి భూలోకంలోకి వేంచేసి మనందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా మొదట చతుర్ముఖుని ఆరాధనగా ఉన్న శ్రీరంగనాధుడు మన భాగ్యవిశేషంచేత ఉభయ కావేరుల నడుమ శయనించారు.సప్త ప్రాకారాలతో విలసిల్లే దివ్యధామం. ఏడు ప్రాకారాలు ఏడు ఊర్ధ్వలోకములుగా చెబుతారు మన పూర్వాచార్యులు.
గర్భాలయంలో వేంచేసి ఉన్న స్వామిని “పెరియ పెరుమాళ్” అని తిరునామం.అమ్మవారు శ్రీరంగనాయకి. ఉత్సవమూర్తికి “నుమ్బెరుమాళ్”అని తిరునామం. శ్రీ రంగనాధుడిని ఆళ్వార్లు కీర్తించినటువంటి కొన్ని పాశురాలను చూద్దాము.

ఒన్ఱు మఱన్దఱియే నోదనీర్ వణ్ణనై నాన్
  ఇన్ఱు మరప్పవో వేழனకాళ్-అన్ఱు
  కరువరజ్గత్తుట్కిడన్దు కైతొழுదేన్ కణ్ణేన్
  తిరువరబ్గ మేయాన్ తిశై.
         పొయిగై ఆళ్వార్-ముదల్ తిరువన్దాది.6

 మనత్తుళ్ళాన్ వేజ్గడత్తాన్ మాకడలాన్ మట్రుమ్‌
  నినైప్పరియ వీళరజ్గత్తుళ్ళాన్-ఎనైప్పలరుమ్‌
  దేవాది దేవనెనప్పడువాన్; మున్నొరునాళ్
  మావాయ్ పిళంద మగన్.
        పూదత్తాళ్వార్-ఇరండాంతిరువన్దాది.28

  విణ్ణ గరం వెకా విరితిరై నీర్ వేజ్గడమ్‌
  మణ్ణకరమ్ మామాడ వేళుక్కై;-మణ్ణగత్త
  తెన్ కుడన్దై తేవార్‌తిరువరజ్గమ్ తెంకోట్టి;
  తన్ కుడజ్గై నీరేறாన్ తాழవు.
        పేయాళ్వార్-మూన్ఱాం తిరువన్దాది.62

  కొణ్డై కొణ్డ కోదై మీదు తేనులావు కూనికూన్
  ఉణ్ణై కొణ్ణ రజ్గవోట్టి యుళ్ మగిழన్ద నాదనూర్
  నణ్డై యుణ్డు నారై పేర వాళపాయ ;నీలమే
  అణ్డై కొణ్డు కెణ్డై మేయు మన్దణీరరజ్గమే.
             తిరుమழிశై ఆళ్వార్ తిరుచ్చన్ద విరుత్తమ్‌.49

 కజ్గులు మ్పగలు జ్కణ్డుయి లఱియాళ్ కణ్ణనీర్ కై గళాలిఱైక్కుమ్;
  శబ్గు శక్కరజ్గళెన్ఱు కైకూప్పుమ్‌ తామరైక్కణ్ణెన్ఱే తళరుమ్,
  ఎజ్గనే తరిక్కేనున్నై విట్టెన్ను మిరునిలజ్కై తழாవిరుక్కుమ్‌
  శెజ్గయల్ పాయ్‌నీర్ త్తిరువరజ్గత్తా యివళ్ తిఱతైన్ శెయ్‌గిన్ఱాయే||
           నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-2-1

  ఇరుళిరియ చ్చుడర్ మణిక ళిమైక్కుమ్‌ నెట్రి
  యినత్తుత్తియణి పణమాయిరజ్గళార్‌న్ద
  అరవరశ ప్పెరుమ్‌జోది యనన్దనెన్ను
  మణివిళబ్గు మయర్ వైళ్ళె యణై యై మేవి;
  త్తిరువరజ్గ ప్పెరునగరుళ్ తెణ్ణీర్పొన్ని
  తిరైక్కైయా లడివరుడ ప్పళ్ళికొళ్ళుం
  కరుమణియై క్కోమళత్తై క్కణ్డుకొణ్డు
  ఎన్ కణ్ణిణైగ ళెన్ఱుకొలో కళిక్కునాళే.
          కులశేఖరఆళ్వార్-పెరుమాళ్‌తిరుమొழி 1-1-1

  మాదవత్తోన్ పుత్తిరన్ పోయ్ మఱి కడల్వాయ్ మాణ్డానై
  ఓదువిత్త తక్కణైయా వురువురువే కొడుత్తానూర్‌
  తోదవత్తి త్తూయ్‌మఱై యోర్ తుఱై పడియ త్తుళుమ్బియెజ్గుమ్‌
  పోదిల్‌వైత్త తేన్ శొరియుం పునలరజ్గ మెన్బదువే.
              పెరియాళ్వార్-పెరియాళ్వార్ తిరుమొழி 4-8-1

  పొజ్దోదం శూழన్ద పువనియుం విణ్ణులగమ్‌
  అజ్గాదుమ్‌ శోరామే యాళ్ గిన్ఱ వెమ్బెరుమాన్‌
  శెజ్గోలుడైయ తిరువరజ్గచ్చెల్వనార్‌
  ఎజ్గోల్ వళైయా లిడర్ తీర్వ రాగాదే.
         ఆండాళ్ నాచ్చియార్ తిరుమొழி 11-త్రీ

  పచ్చై మామలై పోల్ మేని పవళవాయ్ కమల చ్చెజ్గణ్‌
  అచ్చుదా అమరరేఱే ఆయర్ తమ్‌ కొలిన్దే యెన్ఱుమ్‌
  ఇచ్చువై తవిర యాన్‌పోయ్ ఇన్దిరలోకమాళుమ్‌
  అచ్చువై పెఱినుం వేణ్డేన్ అరజ్గమానగరుళానే.
            తొణ్డరడిప్పొడియాళ్వార్-తిరుమాలై

అమల నాదిపిరాన్ అడియార్కు ఎన్నై ఆట్పడుత్త
  విమలన్;విణ్ణవర్ కోన్ విరై యార్ పొழிల్ వేజ్గడవన్;
  నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్ మదిళరజ్గత్తమ్మాన్-
  తిరుక్కమల పాదం వన్దు ఎన్ కణ్ణి నుళ్ళన వొక్కిన్ఱదే.
            తిరుప్పాణి ఆళ్వార్ అమలనాదిపిరాన్-౧

తుళజ్గునీణ్ముడి యరశర్ దమ్‌కురిశిల్ తొణ్డైమన్నవన్ తిణ్డఱలొరువఱ్కు;
  ఉళజ్గొళన్చి నోడిన్నరుళ్ శురన్ద జ్గొడునాழிగై యేழுడనిరుప్ప;
  వళజ్గొళ్ మన్దిరం మట్రవ ర్కరుళిచ్చెయ్‌దవా ఱడియే నఱిన్దు; ఉలగ
  మళన్ద పొన్నడియే యడైన్దుయ్‌న్దే నణిపొழிల్ తిరువరజ్గత్తామ్మామే||
            తిరుమంగై ఆళ్వార్ పెరియ-తి.మొ. 5-8-9

వాళి తిరునామాలు


తిరుమగళుమ్‌ మణ్ముగళుమ్‌ శిఱక్కవన్దోన్ వాழிయే
  శెయ్యవిడై త్తాయ్‌ మగళావ్ శేవిప్పోన్ వాழிయే
  ఇరువిశుమ్చిల్ వీత్తిరుక్కు మిమైయవర్‌కోన్ వాழிయే
  ఇడర్ కడియ ప్పాఱ్కడలై యెయ్‌దినాన్ వాழிయే
  అరియ తయరదన్ మగనా యవదిరిత్తాన్ వాழிయే
  అన్దరియామిత్తువము మాయినాన్ వాழிయే
  పెరుగి వరుం పొన్ని నడుప్పిన్ తుయిన్దాన్ వాழிయే
  పెరియ పెరుమాళెజ్గళ్ పిరానడిగళ్ వాழிయే.
   రేపటి రోజు శ్రీరంగం నాలుగవ భాగం తెలుసుకుందాం

అడియేన్ రామానుజ దాసన్

 

*ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ?*

*ధనుర్మాసము* ఒక విశిష్టమైన మాసము (నెల)

కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి *చాంద్రమానం* లెక్కిస్తారు. *సూర్యుడు* ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి *సౌరమానాన్ని* లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని *సంక్రమణం* అంటారు .

ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును *సౌరమాసం* అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .

*ధనస్సురాశిలో* ప్రవేశించిన సమయం *ధనుస్సంక్రమణం* . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము *ధనుర్మాసము* అంటారు. మానవులకు *ఒకసంవత్సరం* దేవతలకు *ఒకరోజు* అంటారు . ఈలెక్కన  *దక్షిణాయణం* *రాత్రి* *ఉత్తరాయణం* *పగలుగా* భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . *మకరరాశిలో* ప్రవేశించు సమయం *మకరసంక్రమణం* ఇక్కడినుండి *ఉత్తరాయణం* . అనగా . . . పగలుగా భావన . ఇలా భావించినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐన *ధనుర్మాసం* *ప్రాతఃకాలమువలె* *పవిత్రమైనది* . . . *సాత్వికమైన* ఆరాధనలకు ప్రధానమైనది . కనుక *సత్వగుణ* ప్రధానమైన *విష్ణువును* ఈనెలలో *ఆరాధిస్తారు* . . . ఈ నెల *విష్ణుమూర్తికి* *ప్రీతికరమైనది* . *గోదాదేవి* కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘ *పండుగ* *నెలపట్టడం* ‘ అనికూడా అంటారు.

ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా *ముగ్గును* *తీర్చిదిద్దుతారు* . అయితే ఈ ధనుర్మాసం *సౌరమానానికి* సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) *చాంద్రమాన* *అనుయాయులం* . దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో *చంద్రుని* తీర్చిదిద్దుతారు.

కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. *ధనుర్మాసం* కూడా చాలా *ఆధ్యాత్మిక*  *ప్రయోజనాలు* కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా *చాలా* *ప్రత్యేకత* ఉంది. *ధనుర్మాసమంతా* .. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. *దీపారాధన* చేయడం వల్ల *మహాలక్ష్మి* *కరుణా* , *కటాక్షాలు* *సిద్ధిస్తాయి* .
ధనుర్మాసం *విష్ణువికి* చాలా *ప్రత్యేకమైనది* . తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. *సుప్రభాతం* బదులు *తిరుప్పావై* గానం చేస్తారు. *విష్ణు* *ఆలయాలల్లో* ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని *బాలభోగం* అంటారు. అలాగే *ధనుర్మాసం* *దేవతలకి* *బ్రాహ్మీ* *ముహూర్తం* *లాంటిది* . ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా *మంచిది* .
ధనుర్మాసం వచ్చిందంటే.. *ఆలయాల్లో* *పండుగ* వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల *వైష్ణవులు* *ధనుర్మాస* *వ్రతం* ఆచరిస్తారు. *గోదాదేవి* ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని *కీర్తించింది* . సూర్యాలయాలు, *వైష్ణవాలయాలు* సందర్శించడం చాలా మంచిది.

*ధనుర్మాసం* *ఫలశ్రుతి* 

ఈ ధనుర్మాసంలో *విష్ణుమూర్తిని* మనము ఒక్క రోజు అయిన *మనసా* *వాచ* *కర్మణా* *యదాశక్తిగా* *పూజించిన* యెడల *1000* *యేళ్ళు* విష్ణుమూర్తిని పూజించిన *ఫలితము* కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక *నదిలోకాని* లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య స్థలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన *పుణ్య* *స్థలంలో* ఒక్క మునుగు మునుగిన *4* *రెట్లు* *అశ్వమేధయాగం* చేసిన ఫలితము దక్కును.పవిత్రమైన ఈ ధనుర్మాసాన్ని    ధనుర్మాస వ్రత ఆచరణతో పునీతం చేసుకుందాము గోదారంగనాధుల అనుగ్రహం పొందుదాము

*ఆండాళ్* *దివ్య* *తిరువడిగళే* *శరణం*
*శ్రీమతే* *రామానుజాయ* *నమః*
*ప్రేమతో*

*మీ* *కర్పూరం*
*గోపిధర్*
💥🎊🙏👏🌸

 

తిరుమల గురించి 11 నిజాలు

  1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
  2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
  3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
  4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
  5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
  6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
  7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
  8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
  9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
  10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
  11. క్రీ.శ.1800 సం.లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

    🙏🙏గోవిందా గోవిందా🙏🙏

 

~~~ పంచ కృష్ణ క్షేత్రాలు ~ తిరుక్కణ్ణమంగై క్షేత్రము ~~

ఇది పంచకృష్ణ క్షేత్రాలలో. 108 వైష్ణవ దివ్య దేశాలలోని పంచకృష్ణారణ్య క్షేత్రాలలో రెండవదీ క్షేత్రము.
సన్నిధికి కావలసిన అంశములు ఏడు. అవి
క్షేత్రము,
తీర్థము,
మండపము,
విమానము
నది,
నగరము,
అరణ్యము
ఈ ఏడు కలిగి ఉండుటచే ఈ క్షేత్రానికి సప్తామృత క్షేత్రమని‌కూడా పేరు వచ్చింది.

శ్లోకము: “దర్శనాఖ్యసరో రమ్యే కణ్ణమంగై పురీవరే
అభిషేక లతాయుక్తః భక్తవత్సల నాయకః
ఉత్పలాఖ్య విమానస్థః సురనాథ దిశాముఖః
రోమశర్షి ప్రచేతాభ్యాం సేవితః  కలిజిన్నుతః”

ఎక్కడుందీ క్షేత్రం?

      తమిళనాడు లో నాగపట్టణానికి 33 kms, తంజావూరినుంచీ 76kms, దూరములో ఉంది ~ తిరుచిరాపల్లి నుంచీ 147 kms దూరములో ఉంది.
మూలవర్ : భక్తవత్సలపెరుమాళ్. స్వామివారు చతుర్భుజాలతో శంఖు చక్ర గదా అభయ ముద్రలతో స్థానక భంగిమలో తూర్పు ముఖముగా వెలసి ఉన్నారు.
14అడుగుల యెత్తైన మూలమూర్తి ఠీవిగా సేవసాదిస్తారు. ఆழ்వార్ వుంచిన తిరునామం- పెఱుమ్పుర క్కడల్
ఉత్సవర్: పత్తర్ ఆవి పెరుమాళ్ (భక్తర్ ఆవి -భక్తులకు ఆత్మవంటివాడు)
స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవిలు కొలువుదీరి ఉన్నారు.

తాయార్లు:

మూలవర్ : శ్రీకణ్ణమంగై నాయకి  
ఆశీన భంగిమలో రెండు హస్తాలతో పువ్వులను, మరో రెండు హస్తాలతో
అభయ వరద ముద్రలతో వెలసినారు. అమ్మవారు ప్రత్యేకముగా ఒక సన్నిధిలో ఉన్నారు.

ఉత్సవర్:

అభిషేకవల్లి తాయార్. ద్విభుజయై నిలబడ్డ భంగిమలోనున్నారు .
ఈ సన్నిధిలో ఒక తేనెగూడు ఉంది ~ దేవతలు ,మహర్షులు పెరుమాళ్ళ కల్యాణాన్ని సేవించవచ్చి తేనెటీగల రూపములో యిక్కడే వుండి స్వామిని ఆరాధించే వరంపొందారట. నేటికిఆ తేనెగూటికి తిరువారాధన జరుగుతుంది. తేనెటీగలవలన యెవ్వరూ యీనాటివరకు యిబ్బందిపడినది లేదు.

విమానము : ఉత్పల విమానము;

పుష్కరణి:  దర్శన పుష్కరణి:

పూర్వము వామనుడి పాదాలను బ్రహ్మ కడిగినపుడు ఆయన కమండలములోని నీరు క్రిందపడి ఈ పుష్కరణి  ఏర్పడిందని కథనం. లక్ష్మీదేవి ఈ పుష్కరణిలోనే స్నానమాచరించి తపస్సు చేసింది. ఇందులో భక్తులు స్నానమాచరిస్తే సకల పాపాలు నశించి అనంతమైన
పుణ్యఫలాలు కలుగుతాయని ఒక నమ్మకము.

స్థలపురాణము:

స్కాందపురాణము, పద్మపురాణము, యీ స్థలపురాణాన్ని తెలుపుతున్నాయి.
కణ్ణన్ అంటే కృష్ణుడు ~ మంగై అంటే భార్య అని ~ శ్రీమన్నారాయణుడి దేవేరి
అయిన లక్ష్మీదేవి తపస్సు చేసిన ప్రదేశము కనుక దీనికి తిరుకణ్ణన్ మంగై అని
పిలుస్తారు. ఆమె చేసిన తపస్సుకు మెచ్చి ఇక్కడే శ్రీ భక్తవత్సలస్వామిగా వచ్చి ఆమెను పరిణయమాడి కొలువు
దీరినట్లు కథనం.  108 దివ్యదేశాలలో ఒకటైన “తిరునిన్ఱవూర్” లో కూడా స్వామి శ్రీ భక్తవత్సల స్వామిగా ఆరాధనలందుకుంటున్నారు.
వరుణుడు కూడా ఇక్కడ స్వామిని  సేవించి ప్రత్యక్షము చేసుకున్నాడు.

ఈ క్షేత్రములో ఒక్క రాత్రి గడిపితే మోక్షము సిద్ఝిస్తుందని కథనము. క్రి.శ.8 – 9 శతాబ్దాలలో చోళులు ఆలయ నిర్మాణము చేసినట్లు  ~ 17 వ శతాబ్దములో
తంజావూరి నాయకరాజులు ఆలయాభివృద్దికి కృషి చేసినారు.

గోపురము: ~

90 అడుగుల ఎత్తులో ఐదు అంతస్తులతో ఉంది గోపురము ~ తూర్పు వైపు గోపురముతో పాటూ పడమరవైపున మూడు అంతస్తుల గోపురముంది‌ ~ ఆలయములో రామానుజాచార్యులు, వైకుంఠనాథస్వామి,
నరసింహస్వామి,  హయగ్రీవుడు , శ్రీనివాసుడు ~ హనుమ విగ్రహాలున్నాయి.
గరుడ మండపములో గరుడుడు శంఖు చక్రాలు ముకుళిత హస్తాలతో ఉన్నారు.
గురు ~ శనివారాలు ~ స్వాతి నక్షత్రము రోజులలో గరుడాళ్వారుకు తిరుమంజనము నిర్వహిస్తారు‌ ~ మహా మండప ద్వారానికి ఇరువైపులా
శంఖనిధి ~ పద్మనిధి ~ ద్వారపాలకులు ఉన్నారు.

ఉత్సవాలు:

     తమిళ మాసమైన చిత్తిరై లో పది *రోజులు బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు.*  శ్రీకృష్ణజయంతి~ వైకుంఠఏకాదశి ~ శరన్నవరాత్రులలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.  

మరొక గొప్ప ఆచార్యపురుషుల సంబంధము కలిగినదీ క్షేత్రము.
తిరుక్కణ్ణన్మఙ్గై ఆణ్దాన్ అను వారు ఒకనాడు రెండు కుక్కలు కొట్టుకొనుచుండగా గమనించి , ఆకుక్కలకై వాటి యజమానులుసైతం గొడవపడి ప్రాణాలుకోల్పోవడం చూచి, తమ కుక్కలకై వాటి యజమానులింతగా తెగించినారే , మరి మనము పెరుమాళ సొత్తైయుండగా పెరుమాళ్లు మనను కావరా!అని యోచించి ఆక్షణాన్నుండి తమ భారము పూర్తిగ పెరుమాళ్ళపై వేసి నిబ్బరముగా వున్నారట.

తిరుమంగైయాళ్వార్లు  “పెరమ్బురుక్కడలై (పె.తి.10-10) అను దశకమును అనుగ్రహించుచుండగా నాలుగు పాశురాలు అనుగ్రహించు సమయమున  తిరునిన్ఱవూర్ భక్తవత్సలపెరుమాళ్ యెదురుగా సేవసాదించగా “కురుమామణి కున్ఱినై నిన్ఱవూర్ నిత్తిల తొత్తినై”
అని మంగళాశాసనము చేసనారు. 1970లో ఒక నూతన రథాన్ని ప్రారంభించినారు.

పాశురము ~ తిరుమంగై ఆళ్వార్ ~ పెరియ తిరుమొళి ~( 7-10-1):

   “పెరుమ్బుఱక్కడలై  యడలే ற்ற்త్ తివై ప్పెణ్ణైయాణై; ఎణ్ణిల్ మునివర్ క్కు
    అరుళ్ తరున్దవత్తై ముత్తిన్ తిరట్కోవైయై ప్పత్తరావియై నిత్తిలత్తొత్తినై
    అరుమ్బినై యలరై యడియేన్ మనత్తాశై యై యుముదమ్బొది యిఞ్జువై
    కురుమ్బినై క్కనియై చెన్ఱునాడ

 

వైష్ణవ లక్షణం ఏమిటి

🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻
వైష్ణవ లక్షణం ఏమిటి అని అనేవిషయంలో  మణవాళ మాముని గళ్ శిష్యులు , వానమామలై జీయరుకు , చిన్నమ్మాళ్ అనే స్త్రీకి జరిగిన సంభాషణ వివరిస్తుంది. మన సంప్రదాయములో విద్వత్ వరేణ్యులైన సామాన్య స్త్రీలకుకూడా ఎంత ఆదరణ పొందేవారో  , తెలిపే సంఘటన!
జీయరు స్వామి కొలనులో స్నామాచరించేటప్పుడు అక్కడకు వచ్చిన ఒక సామాన్య స్త్రీ , చిన్నమ్మ ను కొన్ని ప్రశ్నలు అడిగారు.
1) అమ్మా ! నీకులమేమిటి తల్లీ
చిన్నమ్మాళ్- —  నాకులము భాగవత కులము స్వామి🙏

2. ) నీ గోత్ర మేమిటి తల్లీ!
చి।। రామానుజ గోత్రము స్వామి🙏
3. ) నీ సూత్రమేమిటి తల్లి !
చి।। శఠగోప సూత్రము స్వామి

4 ) వేదమేమిటి తల్లి!!
( ఆవిడ ఖంగు తింటుందని అని ముసిముసిగా నవ్వుకొంటూ అడిగారు)

చి।। తమిzha  వేదము స్వామి 🙏
(నాలాయిర దివ్య ప్రబంధాన్ని తమిZha వేదమంటారు, ద్రావిడ వేదము)

5)నీ పురుషుడెవరు తల్లీ!!
చి।। పురుషోత్తముడు స్వామి🙏

6) నీ తల్లిదండ్రులు?!!
చి।। పెరుమాళ్, పిరాట్టియార్ 🙏
 
7. ) బంధులు ?!
చి।। భాగవతోత్తములు స్వామి 🙏

8 ) వృత్తి ఏమిటమ్మా!?
చి।। భాగవత కైంకర్యము స్వామి 🙏

9 ) అమ్మా నీకు దానివల్ల ప్రయోజన మేముటి తల్లీ?!
చి।। అదే ప్రయోజనము స్వామి!! అంతకంటే ఇంక భాగ్యమేముంటుంది స్వామి !! ఆ కైంకర్య భాగ్యాన్ని పొందడా నిర్ తపిస్తుంటాను స్వామి!! ఆ భాగ్యము దొరకడమే ప్రయోజనము!🙏


10 ) నీ వేమన ప్రార్థిస్తావమ్మా? నీకు ఏమి కావాలని , నీ ఏ కోరిక పరిపూర్ణమవ్వాలని?!!
చి।। స్వామి , భాగవత కైంకర్యము చేసే భాగ్యమును పొందాలనేగా నేను కోరుకొనేది స్వామి! ఆ కోరిక తీరి నిరంతరము భాగవత కైంకర్యము చేస్తూ వారికి సంతోషాన్ని, సౌఖ్యాన్నికలిగించే భాగ్యము కలగాలనే ప్రార్థిస్తాను స్వామి!!

జీయరు స్వామి— ఆహా ! ఇదియే కదా వైష్ణవ లక్షణము !
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻

పరమపద వాసులు శ్రీ.ఉ.వే. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారి (94)
*⭕అవతార విశేషాలను స్మరించుకుందాం*

జ్ఞాన సముపార్జనకు జన్మాంతర సంస్కారం అవసరం. కాని, ఆరోగ్య సాధనకు సత్వ గుణమే ప్రామాణికం అంటారు డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల శ్రీనివాస రఘునాథాచార్య స్వామి. వేదవేదాంగాలు జీర్ణం చేసుకున్న ఆయన వయసు తొమ్మిది పదుల పైమాటే. వైష్ణవ సంప్రదాయంలో అందరూ గురువులుగా భావించే ముగ్గురు జియ్యర్లు తమ గురువుగా భావించే రఘనాథాచార్య ఇప్పటికీ సత్సంగాలలో పాల్గొంటున్నారు.
వేద జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు..

ఒక వ్యక్తి జ్ఞానసంపన్నుడు కావాలంటే గురువుల అనుగ్రహం కావాలి. భాగవతుల సౌజన్యం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. అదే మనిషి ఆరోగ్యవంతుడు కావాలంటే తల్లిదండ్రుల ఆశీస్సులు కావాల్సిందే. జన్యుశాస్త్ర పరంగా కూడా ఇది రుజువైన విషయమే. అందుకే నా ఆరోగ్యానికి కారణం మా అమ్మానాన్నల అనుగ్రహంగానే భావిస్తాను.

*🔷అమ్మ పెట్టిన ముద్ద..*
తల్లిదండ్రుల వాత్సల్యం, గురువుల దయ, మిత్రుల సౌజన్యం.. ఇవన్నీ మనిషి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నా జీవితంలో ఇవి సమపాళ్లలో కుదిరాయి. అందుకే తొమ్మిదిపదుల వయసులోనూ ఇదిగో ఇలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇందులో ఏది కొరవడినా మానసిక దౌర్బల్యం.. ఆపై శారీరక అనారోగ్యం కలుగుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణ కూడా ప్రధానమైనది. మనలో సత్వ గుణం ఉన్నంత కాలం ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి సత్వ గుణాన్ని పెంచే ఆహారమే తీసుకున్నాను. కారం, చేదు, పులుపు ఇవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. చక్కెర, ఉప్పు కూడా తక్కువ మోతాదులోనే తీసుకునేవాడిని. నా దేహవృద్ధికి మంచి ఆహారం అందించిన మా అమ్మే ప్రధాన కారకురాలు. ఆప్యాయత రంగరించి ఆమె తినిపించిన గోరుముద్దలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి.

*🔷నియమాలతోనే..*
ఆరోగ్యం విషయంలో ఇప్పటికీ చాలా కచ్చితంగా ఉంటాను. ప్రస్తుతం ఉదయం లేవగానే గోరు వెచ్చని హార్లిక్స్‌, పాలు తాగుతాను. అప్పుడప్పుడు కాఫీ. ఉదయం 10.30 గంటలకు కారంలేని పప్పుతో భోజనం. మజ్జిగలో పంచదార లేక అరటి పండు, ఒక స్వీటుతో భోజనం ముగిస్తాను. సాయంత్రం 5 గంటలకు కాఫీ తాగుతాను. రాత్రి 8 గంటలకు మితంగా భోజనం చేస్తాను. భోజన సమయంలో గోరువెచ్చని నీటిని తాగుతాను. అది వేసవికాలమైనా సరే. గంటల తరబడి ధార్మిక ప్రవచనాలు ఇచ్చే సమయాల్లో మిశ్రి కలిపిన నీటితో పెదాలను అద్దుకుంటూ దాహం తీర్చుకుంటాను.

*🔷అష్టాక్షరి అనుగ్రహం..*

మా నాన్నగారు శ్రీనివాసాతాతాచార్య స్వామి మహా పండితుడు. చిన్నప్పుడు నా చెవిలో అష్టాక్షరి మంత్రం చెప్పేవారు. ఎందుకో అర్థం కాక.. ఒక చెవిలో చెప్పగానే.. ‘మరి రెండో చెవిలోనో..’ అంటూ మరో చెవిని చూపేవాడిని. ఆయన ఉపదేశించిన ఆ అష్టాక్షరి మంత్రమే నాకు జ్ఞానభిక్ష ప్రసాదించింది. నాన్నగారి దగ్గర శిష్యరికంలో సంస్కృత, వైష్ణవ సంప్రదాయ గ్రంథాలతో పాటు ఎలా జీవించాలో నేర్చుకున్నాను. న్యాయ వ్యాకరణం, శాసా్త్రభ్యాసం కోసం 14వ ఏట హైదరాబాద్‌లోని సీతరాంబాగ్‌లో ఉన్న సంస్కృత పాఠశాలలో విద్యార్థిగా చేరాను. ఆరేళ్లపాటు సాహిత్య, వ్యాకరణ, తర్క మీమాంస శాసా్త్రలను రామానుజభాష్యంతో సహా అధ్యయనం చేశాను. ఈ క్రమంలో నాపై ఆచార్యులు చూపించిన ప్రేమభిమానాలను మరువలేను. ఆపై నా జీవనయానం అంతా ఆధ్యాత్మిక మార్గంలోనే సాగుతోంది.

*🔷ధార్మిక వ్యాపకం..*

1946 నుంచి వరంగల్‌ శివనగర్‌లో స్థిరనివాసం. ఇక్కడి వైదిక పాఠశాలలో, శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలోనూ సంస్కృత అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ‘సతఃసాంప్రదాయ పరిరక్షణ సభ’, ‘సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్‌’ సంస్థలను స్థాపించి వీటి ద్వారా ‘శ్రీవిష్ణు సహస్రనామ భాష్యం’, ‘ముండకోపనిషత్‌’, ‘కఠోపనిషత్‌’, ‘వేద ప్రామాణ్యము’, ‘శ్రీ భాష్యమునకు తెలుగు వ్యాఖ్యానము’ వంటి 90కి పైగా గ్రంధాలను ప్రచురించారు. ‘శ్రీపాంచరాత్ర ఆగమ పాఠశాల’ ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. శాస్త్ర సంప్రదాయ, సాహిత్య సేవా రంగాల్లో విశేష కృషి చేసిన ముగ్గురు ప్రముఖులకు ప్రతి ఏడాది శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
వారు మన వైష్ణవ సిద్ధాంత దిక్సూచి, అపర ఆచార్యులు మనందరికి మార్గదర్శకులు. వారు ఆచార్య తి‌రువడిని చేరారు అనేది మనందరికి చాలా లోటు. వారి ఆశయం శ్రీవైష్ణవ సిద్ధాంత వ్యాప్తి. ఆదిశగా మనమందరం వారు అందించిన సంప్రదాయ గ్రంథ పఠనం చేద్దాం. అదే వారికి మనమిచ్చే కానుక.
(ఒక మిత్రుడు పంపిన సందేశం ఇది.)
🙏 శ్రీమతే రామానుజాయ నమః🙏
——-+++
ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్ధిక కేసరి మహామహోపాధ్యాయ శ్రీ రఘునాథాచార్య స్వామి వారి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు.
శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా, సంపరాయ పరంపరను కొనసాగిస్తూ జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యుల వారు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారు. ఆజన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి రఘునాథాచార్య స్వామి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
—- CM KCR

శ్రీమతే రామానుజాయనమః🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పెరియాళ్వార్ పాసురాలద్వారా
పెరుమాళ్ళను అనుభవించి హృదయములో నిలుపుకొనే మార్గమును చూస్తున్నాము  కదా !

మొట్టమొదట వారు పరమాత్మ తిరువడిగళ్ —- ను పాడుతున్నారు.
పాదములలోని అణువణువుని సేవించుకొని పరవశము పొందుతున్నారు.

ఆ పాదాలు ఎలాంటివి? మనలను వుద్దరించేపాదాలు!

పరమపదములో ,సవ్యం పాదం ప్రసార్య — ఒక పాదము చాపి , ఒకపాదము మడిచి నిత్యసూరుల ,ముక్తాత్మల ,తనువులు పులకరించేలా దర్శన మిస్తారు కదా!

పరమపదనాథునిది హిరణ్మయమైన రూపము.
బంగారము— మనము ఈ లోకములో చూసే బంగారముకాదు! ప్రకృతి సంబంధముకలిగిన ఈ బంగారములో రజోతమోగుణములు జడరూపములో ఆశ్రయించి వుంటాయి . కాని పరమపదనాథుని హిరణ్మయరూపము పరిపూర్ణ  శుద్దసత్వ స్వరూపము. మన వూహలకు అందనిదా రూపము.
వారి పాదములు – పొర్కమల పాదము.🙏

అరే అయితే మనముసేవించుకోనేలేమే! మరి ఆశ్రయించేదెలా?

ఆ బెంగయే అక్కరలేదు. అర్చ్యాతిరుమేనిలో ,మనకు ,ఆ తిరు పాదములు సాక్షాత్కరిస్తున్నాయి కదా!

ఆళ్వార్ ఒక పాసురములో పాడుతారు “ “ఆర్ ఎనక్కునిన్పాదమే శరణాగ తందొழிన్దాయ్” తన చరణములను శరణముగా యిచ్చిన దేవాధినాథ పెరుమాళ్ వానమామలైలో మనకొరకు వేంచేపుచేసివున్నారుగా! “ తాళ్గళాయిరత్తాయ్” -అని విశ్వరూపదర్శనములో కనిపించునట్లుకాక , సుతి మెత్తని పాద పద్మ ద్వయముతో మనకు సాక్షాత్కరిస్తున్నారు.

ఎలా మనకు హృద్యముగా అనిపిస్తే అలా సేవించుకొనే వీలుగా , “ నిన్రు, ఇరుందు , కిడందు, ! “ అంతేనా! “ మణ్ తావియ ఈశనై “ పాదములను చాచి ,త్రిభువనములను కొలిచిన కోలములో , ఎన్ని క్షేత్రములలో వేంచేసివున్నారు? కాంచీపురములో “ 🌷ఉలగళంద పెరుమాళ్. 🌷
తిరుక్కోవలూరులో “ 🌷తిరువిక్రమ పెరుమాళ్🌷
శీర్గాழிలో తావి అళందుండిరుక్కర పెరుమాళ్ – 🌷తాడాళన్🌷తిరుపాదములతోనే -ఏలుకొంటున్న , పరిపాలిస్తున్న స్వామి 🙏
అలాంటి స్వామి పాదములను శరణన్న ,ఆయనెంత సులభుడవుతాడో తెలుసా!

తిరుమழிశై ఆళ్వార్ – ఆరావముద పెరుమాళై” నడన్ద కాల్గళ్ నోన్దవో- నడుఙ్గఙ్ఞాలమేనమాయ్ !ఇడంద మెయ్కులుంగ వో !విలంగుమాల్ వరై చ్చురం! కడన్ద కాల్ పరన్ద కావిక్కరై కుడైందెయుళ్!
కిడంద  వారు ఎழுన్దిరున్దుపేశు !
వాழிకేశనే” అని
“ఏన్ పళ్ళి క్కొండీరయ్యా”- ఎందుకు శయనించావయ్యా? లేచి పలుకవేమి ? అని అడిగితే —- ఆ భక్తవత్సలుడు ఆళ్వారే తనకు పిరాన్ – ఏలువాడనిఎంచి , వారి పాశమునకు బంధీఅయిపోయి ఆనందమును అనుభవించు ఆళ్వారుగా తానుమారి , తిరుమழிశై  పిరాన్ ఆఙ్ఞమేరకు లేచి సమాధానము చెప్పబోయారట! అయ్యయ్యో! పరమాత్మను నేనులేవమనడమేమిటి , వారులేచుటేమిటని “ పదరి” తపించిపోయి , వద్దు స్వామి వద్దు అలానే వుండండి అని అంటే, స్వామి ఉత్తానశయనములో వుండిపోయారుట. ఈ భంగిమలోనూ స్వామి పాదసేవ మనకు లభిస్తుంది. 🌷పాండవదూతగా – 🌷తన సౌలభ్యమునుచాటుతూ పరమపదములోలా ఒకపాదము .మడిచి, ఒకటి చాచి — సేవ .
🌷రంగని శయనకోలసేవ 🌷
కలియుగనాథుడిగా 🌷వేంకటేశ్వరునిగా 🌷నిలబడి సేవ !
ఇలా తన చరణకమలములను మనకొసంగిన స్వామిని చేరి” అడిక్కీழ் అమర్న్దు , పుగుందు!” అంతే మనము చేయవలసినది.
ఆ తిరుకమలపాదములను ఆశ్రయించడానికి దానిమీద ప్రేమ ఎలా కలిగేట్లు చేసుకోవాలో నేర్పుతున్నారు – పెరియాళ్వారు!
పాదములను అణువణువును అనుభవిస్తూ!
👣🌹🌸🌹🌸🌹👣🌹👣🌹👣🌹
నిన్న మనము పాదములను అనుభవించాము. నేడు రెండవ పాసురములో పాదపువ్రేళ్ళను ఆ వ్రేళ్ళకుగల నఖములను అనుభవిస్తున్నారు!

ఒద్దికగా అన్నీ ఏ ఏ సాముద్రిక లక్షణములతో ఏ ఏ పరిమాణములో వుండాలో అలా అమరి వున్నాయిట కన్నయ్యవి. అందుకనే 🌷ఒత్తిట్టిరుందవా కాణీరే 🌷—- 🙏అని పాడారు. ఏమిటి కాణీరే— అదే కాలికున్న ఒద్దికైన  పది వ్రేళ్ళు దానిమీదున్న నఖములు, వాటి అందమును వర్ణిస్తున్నారు! కళ్ళు మూసుకొని మనము కన్నయ్య తిరుపాదములను వాటి వ్రేలు గోళ్ళను అనుభవిద్దాము. కన్నయ్య అరిపాదము తామరలా ఎఱ్ఱగా వుంటుందికదా! పై పాదము నీలమణిలా తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. వాటినుంచి తామర రేకులలా పది వేళ్ళు అందంగా సాగి వుంటాయి, అంచులు కొసలు ఎఱ్ఱగా పైన నీలిరంగుతో ! వాటి పైన వజ్రములా వెలిగే నఖములు!
యశోద కన్నయ్య ఒక్కొక్క వ్రేలికి ఆభరణములు తొడగవలెనని ఆశ పడినదిట. ఆడపిల్లదా , మగపిల్లవాడిదా అనే వ్యత్యాసమును చూడదుట యశోద! కన్నయ్యకు తగినట్లుగ సౌకర్యముగ అందంగా వుండాలి అంతే!
దానికని ఏరి ఏరి , బొటనవేలికి , కనకము, ప్రక్కవేలికి ముత్యము, తరువాత మాణిక్యము, తరువాత పగడము – ఇలా – గోకులపు నాయకుడి బిడ్డకదూ! అందుకని నవరత్న మాలలో ఎలా పొందికగా మణి తరువాత ఒక మణి పేరుస్తారో- అలా యశోద అందమైన ఆభరణములను పేర్చి కన్నయ్యకు తొడిగిందిట. అది చూసేందుకే ఒక జ్యోతి శిఖలా తేజోమయమై కనిపిస్తుంది కదా! శ్రీరంగనాథుడుకి – నంబెరుమాళ్ కు వజ్రకవచ సేవనాడు , మాణిక్య పాదుకలు సమర్పిస్తారు. వారి పాదమునకు ఒద్దికగా నీలమణులు , మాణిక్యములు ,వజ్రములు ముత్యములతో , నీలి వ్రేలిమధ్యలో ఎఱ్ఱని మాణిక్య బిళ్ళ – బొటనవేలికీ మధ్యవేలుకూ మధ్యలో , ఎంత ద్దగద్దగాయమానంగా మనచూపులు ఆ పాదములనుండి మరలిరానని మారాం చేసేంత అందంగా వుంటుందో! అది అనుభవైకవేద్యమే!
అలా, అంతకంటే మిన్నగా అనీ – అనవచ్చేమో, యశోదపిరాట్టి కన్నయ్యకాలికి నగలను తొడిగిందిట!
కన్నయ్య పాదాలే అందము. ఆ అందమునకు వన్నెతెచ్చు ఆభరణములు! మణి వణ్ణన్ పాదములుకదా అవి. ఆమాణిక్యాలు మణివణ్ణన్ అందానికి తేజస్సు చేకూర్చాయా ,లేక ఆ మణివణ్ణన్ తిరుపాద తేజస్సువల్ల ,ఆ మాణిక్యాలు మెరుస్తున్నాయా? బదులులేని ప్రశ్న ఇది. కాదు కాదు శుద్దసత్వసంపన్నుడైన మణివణ్ణన్ తేజస్సుచేతనే ,ఆ ఆభరణాలకు వన్నె వచ్చింది! “ ముడిచ్చోదియాయ్ ఒన్ ముఖచ్చోది వళర్న్దదువో ! అడిచ్చోది నీ నిన్న తామరైయాయ్ అలర్న్దదువో !
— అని ఆళ్వార్ పాడినట్లు ఒక జ్యోతితో ఇంకొకజ్యోతి పోటీ పడుతూ అంత ఒక తేజోమయ స్వరూపముగా కానవచ్చిందిట.
పరాశర భట్టర్ తన వరదరాజ స్థవములో వరదరాజుని అందాలను వర్ణిస్తూ—-
పద్యాస్యద్యాంగుళిషు వరద!ప్రాన్తత కాంతిసిన్దోః!!
వీచీ వీథీ ముభవ యీష్వంభసాం లమ్బితాసు!!
విన్దన్నిన్దుః ప్రతి ఫలనజాం సమ్పదం కిమ్పదంతే!!
ఛాయాఛద్మా నఖ వితతితాం లమ్భిత శ్శుమిభితస్సన్!!

ఈ వేళ్ళు ఎంత అందంగా వున్నాయంటే- కాంతి స్సింధోః వీచి! సముద్రము- ఆ సముద్రమునుంచి తరంగాలుతరంగాలుగా పరుగున వస్తుంది. కాంతిఅనేసాగరములోనుంచి తేజస్సు అలలుఅలలుగా బయటకు వస్తోంది. అలాగే పరమాత్మ తిరుపాదమనే సముద్రములోంచి ,ఒక్కోవేలు, ఒక్కోఅలలా ,బయటికి వస్తోంది. ఆకడలిఅలలో ఆకాశపు చంద్రుడు  ప్రతిబింబించాడుట, తేజోమయముగా! తిరుపాదకడలి- వ్రేళ్ళను అలలు- దానిపై నఖములనొప్పుచూ చంద్రుని ప్రతిబింబము! ఆహా పరమాత్మ పాదములఅందము వర్ణనాతీతమైనదికదా! ఆ ఊహే ఎంత అద్భుతమైన చిత్రమును మన మనోఫలకముపై దిద్దుతున్నది.
ఆచంద్రుడూ , శివుని ముడిలోనున్నామే ఒకసారి కృష్ణపరమాత్మ( వరదరాజుని) పాదపద్మములలో నుండి చూద్దాము- అని సంబరపడి అయిదు అయిదు పది వ్రేళ్ళ ల్లోనూ చేరీ , ఆ ఆనందముతో తన తేజస్సును పెంచుకొన్నాడుట! పావనమయ్యాడుట! ఎంత అందమైన భావన🙏
ఈ భావనను మించిన వాస్తవము పరమాత్మ పాదపద్మముల వ్రేలు , నఖముల , అందాలు!
ఆ అందానికి పరవశించిన యశోద తోటి గోపికలను “ ఒణ్ణుదలీర్ వన్దు కాణీరే “ – అని పిలుస్తోంది . నుదల్- అంటే- నుదురు. అందమైన నుదురు గలవారా -అని ! అంటే ఆ నుదదుటధరించిన కుంకుమరాగముతో మంగళకరముగా నున్నవారా— అని. అలా నిర్మలమైన మనస్సుగలవారగుటచే వారిలో సాత్వికగుణము అధికరించి , పరమాత్మ అనుభవములో నిండుగ మునిగిపోగలవారని పెరియాళ్వార్ ఉద్దేశ్యము గాబోలు!

నమ్మాళ్వార్ , కాశినవేన్దన్ పెరుమాళ్ అడిక్కీழ்పాడిన పాసురములో “ ఎన్ అగం కழிయాదే- అన్నట్లుగా- మన అహంకారము తొలగి పరమాత్మ పాదసన్నిధిచేరి శరణువేడాలి. “ తాయార్—- పూశిపిడిక్కుం మెల్లడి — ఆ ఎఱ్ఱని పాదకమలములకు కైంకర్యము చేసుకోవాలనే కోరిక పెరగాలి. “ కూవికొళ్ళుం కాలం కురుగాదో” – నన్ను నీ దరికి చేర్చుకొనే సమయ విలంబనము తగ్గి , నీ పాదసేవాకైంకర్యము  లభించే భాగ్యము దక్కదా అని – మనము ఆళ్వార్లలా పరితపించాలి. దానికి పీఠికగా పరమాత్మ తిరువడిని అనుభవించి,మ దిలో ధారణ చేసుకో గలగాలి. అదియే పెరియాళ్వార్ హృదయము. 🙏

పెరియాళ్వార్ తిరువడిగళే శరణం 🙏
రామానుజ దాసి 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పెరియాళ్వార్ మనకు నేర్పిన తిరుపాదకేశ అనుభవము 🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

శ్రీమతే రామానుజాయ నమః 🙏

మొదటి పాసురములో పెరియాళ్వార్ ,తన తిరుమొழிలో ,కృషపపమాత్ముని , అవతారమునకు పూర్వరంగము తిరుకోష్టియూర్ లో ఎలా జరిగిందో , కన్నయ్య గోకులములో అవతరించిన తరువాత , వారి ఆనందము , అనుభవము , నిశ్చల భక్తిని పాడారు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

రెండవ  పాసురములో ఇక పెరుమాళ్ళ దివ్యావయ వర్ణనము చేస్తున్నారు.
తిరుపాద కేశ పర్యంతము !

🌿తిరుపల్లాండులోనే వారు —🌹శెవ్వడి 🌹— అని స్వామి వారి పాదములను పాడారు.
పరమాత్మయందు రుచి ఏర్పడిన తరువాత ,మనలోని రజస్సు, తమస్సులు ,తగ్గి ,సత్వము పెరుగుతుంది . దానితో మనకు పెరుమాళ్ళ మీది ప్రీతి పెరిగిపోయి ,మనకు రక్షకుడైన వారికే రక్షను పెట్టి, మంగళాశాసనము చేయడము జరుగుతుంది. అదే అనునిత్యము ,తిరువారాధన తరువాత , మనము సేవించే తిరు పల్లాండు. 🙏

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
పెరియాళ్వార్ పిళ్ళై తమిழ்
లో యశోదా భావనలో పాడడము మొదలు పెడతారు.
అఖిలాండభువనములనేలే స్వామి ,ఏమీ ఎరుగని బాలుడిలా ,వుయ్యాలలో శయనించి వున్నారు. యశోదాపిరాట్టి ,ఎప్పుడూ ద్వంద్వ భావములో వూగిసవలాడుతూ వుంటుంది. పరాత్పరుడే కన్నయ్య – అని తెలుసు.
కాని మాతృవాత్సల్యము “ ఎన్ శిరికుట్టన్- “అనిపింపజేస్తుంది.
ప్రేమ పాశముచే ,ఆయనకు అన్నీ తానే అయి  ,సపర్యలు చేయాలనిపిస్తుంది. తన కు దొరికిన పెన్నిధి స్వామి. ఆయనను ,తానే జాగ్రత్తగా సంరక్షించాలి, అని తల్లడిల్లి, పోతుంది. రక్ష పెడుతుంది.
అది భక్తి పరాకాష్ట. పరమాత్మను మనకు వరాలొసగి ,మనవెతలు తీర్చే వాడిగా గాక , వారిని ,వారికై ప్రేమించి , వారి సౌకర్యముకొరకై , వారి అభీష్టార్థము ,సపర్యలు- కైంకర్యములు చేయడము.
ఈ పాసురము అన్వయించుకొంటే మనకు దక్కేఫలమదే . మార్గదర్శకత్వము. 🙏
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
యశోద కన్నయ్య ఉయ్యాలవద్ద కూర్చొని వారిని సేవించికొంటోంది . అదిగో, తన బుజ్జి బుజ్జి పాదాలను పై కెత్తాడట కన్నయ్య!
ఎప్పుడూ పెరుమాళ్ళ తిరుపాదముల పై భాగమునే గాని  ,అరిపాదములను సేవించుకొనే భాగ్యము కలుగదు. త్రివిక్రముడిగా త్రిభువనములను కొలిచి నప్పుడు ,వారు పాదమునెత్తినను , వారి తిరుపాదములు చాలా పెద్దగా ఒక్కోపాదము ఒక్కో భువనమును కొలిచేంత విస్తారముగా నుండి , వాటి పరిపూర్ణ దర్శనమునకు అవకాశమే లేకుండా వుండినది.
ఇదిగో ,ఇప్పుడు కన్నయ్య తన బుజ్జి బుజ్జి పాదాలను పైకెత్తి తన చేతితో పట్టుకొని. , భక్తులందరూ అమృతమని కొనియాడే ఈ పాదపు రుచి ఎట్టిదో ,తానూ చూడాలని, తన పగడములవంటి అధరముల మధ్య పెట్టుకొని – శువైత్తు- ఉణ్ణుం — రసించి ఆస్వాదిస్తున్నారుట. కలకండ తీయదనము మాటలలో తెలియదుగదా, నోటిలోవుంచుకొని రుచి చూస్తేగదా తెలిసేది.
ఆలిలై కణ్ణన్ – తొల్లి ప్రళయకాలములో మఱ్ఱాకుపై శయనించిన భంగిమలో నున్న తన చిన్నారి కన్నయ్యను కనులార్పక సేవించుకొంటోంది యశోద!
తానొక్కర్తి అనుభవించడమేమిటి? అందరు కన్నయ్య దివ్యమంగళరూపమును ఆస్వాదించవద్దూ—- అని ,అనిపించిందా తల్లికి. స్వార్థముతోనో, తన చంటిబిడ్డడికి అందరికన్నులూ తగులుతుందని , స్వార్థపూరితమైన ఆలోచన రాలేదు. అదీ ప్రపన్నుల లక్షణము. అహం- నేను- నాది- నాకు – వుండదక్కడ!
లేచి అందరినీ పిలుస్తోంది. రండర్రా రండి—- వచ్చి చూడండి— కాణీర్ కాణీరే—- అంటూ!

పెరియాళ్వార్ అంటున్నారు , కృష్ణుని కన్నతల్లి లక్ష్మీ సమానురాలుట. శీదక్కడల్- పాలసముద్రములో అమృతముతో పాటు ఆవిర్భవించిన  లక్ష్మీపిరాట్టికి – 🌷అన్న- 🌷సమమయిన గొప్పదనమునుగలదైన – దేవకి — యశోదైక్కు పోతంద- యశోదకు అంతటి సమాన గొప్పదనముగలదు- . అలాంటి యశోద , – సాముద్రికలక్షణములూ అంతగొప్పగా వుండాలికదా! అందుకని — – కోదై కుழలాళ్- పూలు ముడుచుకొన్న అందమైన శిరోజములు కలది! పూలు ముడుచుకోవడము – మంగళకరమైన రూపమును సూచిస్తే, నిండైనశిరోజాలు ఆవిడ సౌందర్యమును సూచిస్తుంది, అంతటి అందమైన యశోద, దేవకీదేవి , ఇరువురు గొప్ప తల్లుల ముద్దులపట్టి కన్నయ్య!
పోత్తంద – పేదై కుழవి- కుழవి- శిశువు! పేదై — ఏమీఎరుగని — ముగ్దశిశువు — అలాంటి కన్నయ్య తన కాలివేలుని నోటితో ఆశ్వాదిస్తున్నారు!
పేదై- అని ఎందుకన్నారో— ఆ పదములో ఎన్ని గూఢార్థాలో—- ఆ 🌷🌷తిరుపాదములే మనకు ఆధారము. 🌷మనము శరణాగతి చేయవలసిది ఆతిరువడిగళుక్కే,
🌷తరువాత కైంకర్యము చేయవలసినది -ఆ తిరువడిగళుక్కే—
🌷మనకు  ఈసంసారబంధమునుండి  ముక్తి ప్రసాదించేదీ ఆ తిరువడిగళే—- 🌷మనలను పరమపదానికి దారిచూపి పిలుచుకొని వెళ్ళేదీ ఆ తిరువడిగళే! 🙏

ఆండాళ్ కూడా తన తిరుప్పావైలో 2– 29 వ పాటలలో ఈ తిరువడినే గదా పాడినది! “ పార్కడలుళ్ పైయ తుయిన్డ్ర – పరమన్- 🌷అడిపాడి🌷మనము మనోఫలకముపై ధరించవలసినది ఆయన తిరువడిగళ్ నే! మనము నిరంతరము ధ్యానము చేయవలసిది – ఆ తిరువడిగళే— పాడవలసినది- ఆ తిరువడిగళ్ నే- — మనకు నిరంతరము రక్షగావుండే ఆ తిరువడిగళ్ కలకాలము క్షేమముగ నుండాలని మంగళాశాసనము చేయవలసిది ఆ తిరువడిగళుక్కే!
అందుకే కన 29 వ పాసురములో “ఒన్ పొర్తామరై – అడియై – పోర్తుం- అని పాడింది ఆండాళ్ తల్లి!
అటువంటి తిరుపాదములు!
పెరియవాచ్చాన్ పిళ్ళై ఇక్కడ అంటారు ! మూడుతామరలు చేరి యశోదను మురిపించిందిట. తిరుక్కై కమలం – కరపద్మములు- తిరువాయ్— అధరకమలములు— తిరుపాదకమలము – ఇలా మూడు కమలములు !!!

పై కెత్తిన ఆ పాదముల అందముమాటలకందనిది! నీలవర్ణము కల , నీలమణినిభ పాదముల పై భాగము , ఎఱ్ఱగా పారాణి అలదినట్లున్న పాదపుటంచులు, పింక్ జాకర్ , అని వజ్రములలోకెల్లా శ్రేష్టమైన లేత గులాబివర్ణపు ఛాయలుగల వజ్రములవలె మెరయు నఖములు , ఇవియన్నియు , తామర పూరేకులవంటి అధరముల మధ్య — ఆ  వర్ణకలాపపు అందమును చూసి తరించవలసినదే! ఆ అందమునకు ముగ్ధురాలై యశోద , అందరినీ — పాదకమలంగళ్ కాణీరే—
గోపికలు   ఇంకా రావడములేదేంటి- అనే  త్వరలో , ఒకసారికాదు , మరల మరల రండి , రండిరండి  – అని పిలుస్తాముకదా! అలా మరల వన్దు కాణీరే! – అని పిలుస్తోంది.
ఇక్కడ మానవ సహజమైన మానసిక స్థితిని గుర్తించి ఒక పదప్రయోగము చేసారు పెరియాళ్వార్. సహజంగా గోపికలు చాలా అందగత్తెలు. ఆడవారికి తమ అందముపై కొంచెము అభిమానము ఎక్కువే. నీవెంతఅందంగా వున్నావంటే చాలు , కరిగి పోతారు. అందుకే యశోద మీరందంగా వున్నారు నిజమే అని పిలుస్తోంది. పరమాత్మది తప్ప అందరిది ప్రాకృతిక అందమే. పెరుమాళ్ళ  శుద్దసత్వ అప్రాకృత్తిక పంచోపనిషణ్మయ శోభ
వర్ణనా తీతమైనది. అది దర్శించిన వారికే అనుభవము. అందుకే , ఆ అనుభవమును వారూ పొందాలని , అప్పుడు వారిలో వున్న తమ అందముపట్లున్న “ మిడిక్కు” “ అతిశయము—- దానంతటదే తొలగి పోతుందని – యశోదభావములో పాడే పెరియాళ్వారు వారిని పవழవాయీర్— అందమైన పగడాలవంటి ముఖము ( నోరు) గలవారా! అని సంబోధిస్తున్నారు.
ఇలా  2 పత్తు మొదటి పాసురములో తిరుపాదకమలపు అందమును మనకు చూపి , మనలను పరవశులను చేస్తున్నారు. పెరియాళ్వార్ తిరువడిగళే శరణము🙏
అడియేన్
రామానుజదాసి🙏

దేవాలయమున చేయకూడని 32 దోషములు
🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾

🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻

పూర్వము భగవద్రామానుజులు పరమపదించు సమయమున శిష్యులు దరి చేరి తాము సుకరముగా తరించు మార్గము సెలవివ్వమని వేడుకొనిరి.

అప్పుడు భగవద్రామానుజులు
శ్రీభాష్యము – భగవద్విషయాది గ్రంథ కాలక్షేపము చేయమని చెప్పి, ఒకవేళ చేయలేని పక్షమున అంతటి ఫలమును ఇచ్చునది అయినది

 “శ్రీశస్థలేష్వన్వహం కైంకర్యం ” అనిరి.

అనగా అర్థం, పెరుమాళ్ళు వేంచేసి ఉన్న దివ్య క్షేత్రములలో శక్తి కొలది కైంకర్యము చేయుట అని.

ఆలయమున మన శక్తి కొలది చేయు కైంకర్యములు – ప్రదక్షిణలు చేయుట, ఆలయ ప్రాంగణము తుడుచుట, నీటితో కడిగి కళ్ళాపి చల్లి ముగ్గులు వేయుట, దీపారాధన చేయుట, పూమాలికలు అల్లి స్వామికి సమర్పించుట, ఉత్సవ సమయాలలో తోచిన సహాయము చేయుట ఇత్యాదివి.

ఆలయానికి వెళ్ళినపుడు కొన్ని అపచారములు జరగకుండా జాగ్రత్తపడాలి.

వరాహ పురాణములో ఆలయములో చేయకూడని ముప్పైరెండు కార్యములు తెలుపబడి ఉన్నవి :

1. యానైర్వా పాదుకైర్వాపి  గమనం భగవద్గృహం ।
   దేవోత్సవాత్ అసేవా చ  అప్రణామ స్తదగ్రతః ॥

2. ఏక హస్త ప్రణామశ్చ  పురస్స్వాత్మ ప్రదక్షిణమ్ ।
  ఉచ్ఛిష్టే  చైవ చాశౌచే  భగవద్ వన్దనాదికమ్  ॥

3. పాద ప్రసరణం చాగ్రే   తథా పర్యంక బన్ధనమ్ ।
  శయనమ్ భోజనం చైవ   మిథ్యో భాషణ మేవచ ॥

4. ఉచ్ఛైర్ భాషా వృధా జల్పో  రోదనం చైవ విగ్రహః ।
  నిగ్రహానుగ్రహౌ చైవ  స్త్రీషు సాకూతభాషణమ్ ॥

5. అశ్లీల కథనమ్ చైవ అప్యథో వాయువిసర్జనమ్ ।
  కమ్బలావరణమ్ చైవ పరనిన్దా పరస్తుతి: ॥

6. శక్తౌ గౌణోపచారశ్చ అప్యనివేదిత భక్షణమ్ ।
  తత్తత్కాలోద్భవానామ్ చ  ఫలాదీనామ్ అనర్పణమ్ ॥

7. వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యంజనాదిషు ।
  పృష్టీకృత్యాసనం చైవ  పరేషామభివాదనమ్ ॥

8. గురౌ మౌనం నిజస్తొత్రమ్ దేవతా నిన్దనమ్ తథా ।
  అపచారాస్తథా విష్ణో: ద్వాత్రింశత్ త్పరికీర్తితాః ॥           

అనువాదము:

1. ఏదైనా వాహనమునెక్కి , పాదుకలను ధరించి ఆలయమునకు వెళ్ళుట .

2. ఉత్సవము జరుగుచున్నచో సేవించక తిరిగి వచ్చుట.

3. భగవంతునికి నమస్కరించకుండుట.

4. ఒక చేతితో నమస్కరించుట.

5. భగవంతుని ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయుట.

6. ఎంగిలి చేతితో ఆశౌచముతో నమస్కరించుట.

7. పెరుమాళ్ళకెదురుగా వీపుకు, మోకాళ్ళకు బట్ట చుట్టుకుని ఊగుచూ కూర్చుండుట.

8. ఆలయములో భగవంతుని ఎదురుగా పడుకొనుట.

9. భగవంతుని ఎదురు మండపములో విస్తరి పరుచుకుని భుజించుట.

10. ఆలయమున లౌకిక విషయముల గురించి ఒకరితోనొకరు మాట్లాడుకొనుట.

11. గట్టిగా అనవసర మాటలు మాట్లాడుట.

12. లౌకిక విషయములపై ప్రసంగములు చేయుట.

13. గట్టిగా ఏడ్చుట .

14. ఒకరితోనొకరు పోట్లాడుట.

15. నిగ్రహము కోల్పోయి పక్కవారిని బెదిరించటం వంటి దాష్టిక చేష్టలు చేయుట.

16. ఒకరికి “నీకు ఈ ఉపకారము చేస్తాను”, అని ప్రతిజ్ఞ చేయుట.

17. స్త్రీలతో భావగర్భితముగా పరిహాసము ఆడుట.

18. ఆడరాని మాటలాడుట.

19. అపాన వాయువు విడుచుట. (ఆ అవసరము వస్తే ముందుగానే బయటికి వెళ్ళాలి.)

20. కంబళి – శాలువ మొదలగు వానితో శరీరమంతయు కప్పుకొనుట. చలి అధికముగా ఉన్నచో  పై వస్త్రమును యజ్ఞోపవీతము వలే కప్పుకుని కుడిచేయి బయటకు ఉంచవలెను.

21. సన్నిధిలో ఇతరులను నిందించుట.

22. ఇతరులను పొగుడుట.

23. శక్తి ఉన్నా భగవంతునికి అల్పముగా సమర్పించుట.

24. పెరుమాళ్ళకు ఆరగింపు కాని పదార్థములు సన్నిధిలో కుర్చుని భుజించుట.

25. ఆయా సమయాలలో తన ఇంటిలో గానీ తోటలో గానీ పండిన పండ్లను, కూరలను, పూచిన పూలను పెరుమాళ్ళకు సమర్పించకుండా తాను ఉపయోగించుకొనుట.

26. తాను ఉపయోగించగా మిగిలిన పుష్పాలను, ఫలాలను పెరుమాళ్ళకు వినియోగించుట.

27. పెరుమాళ్ళవైపు వీపు పెట్టి కూర్చొనుట.

28. సన్నిధిలో పెరుమాళ్ళ ఎదుట ఇతరులకు నమస్కరించుట.

29. తన ఆచార్యుల ప్రసంగము వచ్చినపుడు వారిని ప్రశంసిన్చకుండుట.     

30. ఎట్టి సందర్భములలో అయినను తనను తాను పొగడుకొనుట.

31. భగవంతుని నిందించుట.

32. కాళ్ళు చాపుకుని కూర్చొనుట.

ఈ తప్పులను దేవాలయములో చేసినచో సంపాదించుకున్నపుణ్యము హరించుకుపోతాయని వరాహ పురాణములో చెప్పబడియున్నది.

ఎంబెరుమానార్ దివ్య తిరువడిగళే శరణం🙏🏻

*రాముడి  యొక్క ధర్మాచరణ*

🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻

ధర్మాచరణ గురించి రామాయణం లో వాల్మీకి రెండు గుణాలు చెప్పారు. ఒకటి: “ధృతి” రెండు: “నియమం”. శ్రీరాముడు అడవులకి వెళ్ళే ముందు తల్లి కౌసల్యకి నమస్కరించాడు. ఆమె “ధర్మ మార్గం లో నడువు” – అని ఉపదేశించలేదు. రాముడు ధర్మావతారం. ఆయన స్వభావం ధర్మరక్షణ. “ధర్మంచర” అని ఆయనకొకరు చెప్ప బని లేదని తల్లికి తెలుసు. అందుకని ఆమె ఇలా ఆశీర్వదించింది. “నీవు ధృతి (ధైర్యం), నియమాలతో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావో, ఆ ధర్మమే  నిన్ను రక్షించు గాక!” ప్రతీ భారతీయునికి రాముని శీలమే ఆదర్శం. రామనామమే మహామంత్రం. మనలను నేడు పీడిస్తున్న అన్ని జబ్బులకి అదే మందు.

ధర్మ  మార్గమే  నిజమైన భక్తి యని  రాముఁడు
నమ్మాడు .  ధర్మమే మనకూ , మన  కుటుంబాలకు , మన సమాజానికి , హితకారియై  ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది . థర్మాన్ని రక్షిస్తే  ధర్మం మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. అందుకే రాముడికి  సీతకంటే కూడా , ధర్మం అంటేనే ఇష్టం. ఇదే థర్మాన్ని
పాటిస్తే  మనమూ దేవునిపట్ల  నిజమైన
భక్తి  కలిగియున్నవారమవుతాము.

శ్రీరాముఁడు  ధర్మ నిష్టా గరిష్టుడు.  ఏ కాలంలో నైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా , ధర్మలుబ్ధము   కాకూడదు, .అని రాముఁడు విశ్వశిస్తాడు. దానికి ఉదాహరణ ఒకటి.  

శ్రీరాముఁడు  వనవాసంలో యుండఁగా ,  భరత, శత్రుఘ్నుల వల్ల  తన పితృ వియోగ వార్త
తెలుసుకుని , చింతాక్రాంతుడై  విలపించి ,
తనకు  విహిత కర్మ  అయినటువంటి పితృకర్మ
ఆచరణకొరకు ,  ఆపద్ధర్మముగా అక్కడ  వన
వాసములో  లభించినటువంటి  కంద మూలా దులతో , గతించిన  తన తండ్రి దశరథుడికి ,
శ్రాద్దము  ఆచరించి , మందాకినీ నది  వద్ద
పితృదేవులకు  ఉదక తర్పణాలు ఇచ్చి , పితృ
దేవతలకు  సద్గతి కలుగచేశాడు.  

సుపంధానంతు  గచ్ఛంతం :-

రామాయణంలోని  అరణ్యకాండ మనకు
ఒక  గొప్ప  విషయాన్ని చెబుతుంది.  సీతా వియోగంలో ఉన్న శ్రీరాముఁడు  ఆమె కోసం
వెతుకుతూ , నదులను , చెట్లను,  పుట్టలను ,
కొండలను , గుట్టలను,  లేళ్లను , కుందేళ్ళను ,
ఇలా కనిపించిన  చరాచర జీవరాశి నంతటిని
సీత  గురించి  ప్రశ్నిస్తాడు.  ఆయనస్థితిని చూసి
తట్టుకోలేక , లేళ్ళు  యధాశక్తి ప్రయత్నించి ,
ఆయనకు  రావణ దుర్మార్గాన్ని  గురించి సూచించాయట. పర్ణశాలవైపు  చూడటం,
ఆపై  దక్షిణంగా  పరిగెత్తడం, ఆగి  ఆకాశంవైపు
చూసి  కంటనీరు  పెట్టడం ,ఇలా చేస్తున్నాయట.
ఇది  గమనించిన  రాముడికి పర్ణశాలలో ఉన్న
సీతను , ఎవరో  రాక్షసుడు ఎత్తుకుపోయి ,
ఆకాశమార్గంలో  దక్షిణదిశగా ప్రయాణించాడని
అర్థమైందిట . ఈ స్థితిని  వర్ణిస్తున్న వాల్మీకి
శ్లోకం , దీనస్థితిలో  పడిన ప్రతి సత్పురుషునికి
ఒక  ఓదార్పు  నిస్తుంది..
” సుపంధానంతు  గచ్ఛన్తం
  తిర్య o చొపి   సహాయతే
  కుపంధానంతు  గచ్ఛన్తం
  సోదరోపి  విముంచతి “

అంటే  మంచి మార్గంలో  పయనిస్తున్న వ్యక్తులకు , పశుపక్ష్యాదులు  కూడా సాయం
చేస్తాయట .  అందుకే రామునికి  లేళ్లు, జటాయువు, సంపాతి  , వానరులు కూడా
సాయం  చేశారు .  దుర్మార్గంలో  నడిచే వ్యక్తిని ,
సోదరుఁడు  కూడా విడిచిపెట్టి  వెళ్లిపోతాడుట.
రావణుని  విషయంలో సరిగ్గా  అదే జరిగింది .
ఇదే  వాల్మీకి  మహర్షి అరణ్యకాండలో  , మానవాళికి , చెప్పిన  మహాపదేశం. రామాయణ కాలానికే  కాదు , ఏ కాలానికైనా
ఏ  పరిస్తితుల్లోనైనా  వర్తించే మాటలివి .
అందుకే  కొండలున్నంతవరకు , నదులు  ప్రవహిస్తున్నంత కాలమూ , రామాయణం
ఉంటుందని , సృష్టికర్త  బ్రహ్మదేవుడు ఉద్ఘాటించిన  నగ్నసత్యం.
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻