పంచ కృష్ణ క్షేత్రాలు ~ తిరుక్కణ్ణమంగై క్షేత్రము
Posted by adminDec 4
~~~ పంచ కృష్ణ క్షేత్రాలు ~ తిరుక్కణ్ణమంగై క్షేత్రము ~~
ఇది పంచకృష్ణ క్షేత్రాలలో. 108 వైష్ణవ దివ్య దేశాలలోని పంచకృష్ణారణ్య క్షేత్రాలలో రెండవదీ క్షేత్రము.
సన్నిధికి కావలసిన అంశములు ఏడు. అవి
క్షేత్రము,
తీర్థము,
మండపము,
విమానము
నది,
నగరము,
అరణ్యము
ఈ ఏడు కలిగి ఉండుటచే ఈ క్షేత్రానికి సప్తామృత క్షేత్రమనికూడా పేరు వచ్చింది.
శ్లోకము: “దర్శనాఖ్యసరో రమ్యే కణ్ణమంగై పురీవరే
అభిషేక లతాయుక్తః భక్తవత్సల నాయకః
ఉత్పలాఖ్య విమానస్థః సురనాథ దిశాముఖః
రోమశర్షి ప్రచేతాభ్యాం సేవితః కలిజిన్నుతః”
ఎక్కడుందీ క్షేత్రం?
తమిళనాడు లో నాగపట్టణానికి 33 kms, తంజావూరినుంచీ 76kms, దూరములో ఉంది ~ తిరుచిరాపల్లి నుంచీ 147 kms దూరములో ఉంది.
మూలవర్ : భక్తవత్సలపెరుమాళ్. స్వామివారు చతుర్భుజాలతో శంఖు చక్ర గదా అభయ ముద్రలతో స్థానక భంగిమలో తూర్పు ముఖముగా వెలసి ఉన్నారు.
14అడుగుల యెత్తైన మూలమూర్తి ఠీవిగా సేవసాదిస్తారు. ఆழ்వార్ వుంచిన తిరునామం- పెఱుమ్పుర క్కడల్
ఉత్సవర్: పత్తర్ ఆవి పెరుమాళ్ (భక్తర్ ఆవి -భక్తులకు ఆత్మవంటివాడు)
స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవిలు కొలువుదీరి ఉన్నారు.
తాయార్లు:
మూలవర్ : శ్రీకణ్ణమంగై నాయకి
ఆశీన భంగిమలో రెండు హస్తాలతో పువ్వులను, మరో రెండు హస్తాలతో
అభయ వరద ముద్రలతో వెలసినారు. అమ్మవారు ప్రత్యేకముగా ఒక సన్నిధిలో ఉన్నారు.
ఉత్సవర్:
అభిషేకవల్లి తాయార్. ద్విభుజయై నిలబడ్డ భంగిమలోనున్నారు .
ఈ సన్నిధిలో ఒక తేనెగూడు ఉంది ~ దేవతలు ,మహర్షులు పెరుమాళ్ళ కల్యాణాన్ని సేవించవచ్చి తేనెటీగల రూపములో యిక్కడే వుండి స్వామిని ఆరాధించే వరంపొందారట. నేటికిఆ తేనెగూటికి తిరువారాధన జరుగుతుంది. తేనెటీగలవలన యెవ్వరూ యీనాటివరకు యిబ్బందిపడినది లేదు.
విమానము : ఉత్పల విమానము;
పుష్కరణి: దర్శన పుష్కరణి:
పూర్వము వామనుడి పాదాలను బ్రహ్మ కడిగినపుడు ఆయన కమండలములోని నీరు క్రిందపడి ఈ పుష్కరణి ఏర్పడిందని కథనం. లక్ష్మీదేవి ఈ పుష్కరణిలోనే స్నానమాచరించి తపస్సు చేసింది. ఇందులో భక్తులు స్నానమాచరిస్తే సకల పాపాలు నశించి అనంతమైన
పుణ్యఫలాలు కలుగుతాయని ఒక నమ్మకము.
స్థలపురాణము:
స్కాందపురాణము, పద్మపురాణము, యీ స్థలపురాణాన్ని తెలుపుతున్నాయి.
కణ్ణన్ అంటే కృష్ణుడు ~ మంగై అంటే భార్య అని ~ శ్రీమన్నారాయణుడి దేవేరి
అయిన లక్ష్మీదేవి తపస్సు చేసిన ప్రదేశము కనుక దీనికి తిరుకణ్ణన్ మంగై అని
పిలుస్తారు. ఆమె చేసిన తపస్సుకు మెచ్చి ఇక్కడే శ్రీ భక్తవత్సలస్వామిగా వచ్చి ఆమెను పరిణయమాడి కొలువు
దీరినట్లు కథనం. 108 దివ్యదేశాలలో ఒకటైన “తిరునిన్ఱవూర్” లో కూడా స్వామి శ్రీ భక్తవత్సల స్వామిగా ఆరాధనలందుకుంటున్నారు.
వరుణుడు కూడా ఇక్కడ స్వామిని సేవించి ప్రత్యక్షము చేసుకున్నాడు.
ఈ క్షేత్రములో ఒక్క రాత్రి గడిపితే మోక్షము సిద్ఝిస్తుందని కథనము. క్రి.శ.8 – 9 శతాబ్దాలలో చోళులు ఆలయ నిర్మాణము చేసినట్లు ~ 17 వ శతాబ్దములో
తంజావూరి నాయకరాజులు ఆలయాభివృద్దికి కృషి చేసినారు.
గోపురము: ~
90 అడుగుల ఎత్తులో ఐదు అంతస్తులతో ఉంది గోపురము ~ తూర్పు వైపు గోపురముతో పాటూ పడమరవైపున మూడు అంతస్తుల గోపురముంది ~ ఆలయములో రామానుజాచార్యులు, వైకుంఠనాథస్వామి,
నరసింహస్వామి, హయగ్రీవుడు , శ్రీనివాసుడు ~ హనుమ విగ్రహాలున్నాయి.
గరుడ మండపములో గరుడుడు శంఖు చక్రాలు ముకుళిత హస్తాలతో ఉన్నారు.
గురు ~ శనివారాలు ~ స్వాతి నక్షత్రము రోజులలో గరుడాళ్వారుకు తిరుమంజనము నిర్వహిస్తారు ~ మహా మండప ద్వారానికి ఇరువైపులా
శంఖనిధి ~ పద్మనిధి ~ ద్వారపాలకులు ఉన్నారు.
ఉత్సవాలు:
తమిళ మాసమైన చిత్తిరై లో పది *రోజులు బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు.* శ్రీకృష్ణజయంతి~ వైకుంఠఏకాదశి ~ శరన్నవరాత్రులలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
మరొక గొప్ప ఆచార్యపురుషుల సంబంధము కలిగినదీ క్షేత్రము.
తిరుక్కణ్ణన్మఙ్గై ఆణ్దాన్ అను వారు ఒకనాడు రెండు కుక్కలు కొట్టుకొనుచుండగా గమనించి , ఆకుక్కలకై వాటి యజమానులుసైతం గొడవపడి ప్రాణాలుకోల్పోవడం చూచి, తమ కుక్కలకై వాటి యజమానులింతగా తెగించినారే , మరి మనము పెరుమాళ సొత్తైయుండగా పెరుమాళ్లు మనను కావరా!అని యోచించి ఆక్షణాన్నుండి తమ భారము పూర్తిగ పెరుమాళ్ళపై వేసి నిబ్బరముగా వున్నారట.
తిరుమంగైయాళ్వార్లు “పెరమ్బురుక్కడలై (పె.తి.10-10) అను దశకమును అనుగ్రహించుచుండగా నాలుగు పాశురాలు అనుగ్రహించు సమయమున తిరునిన్ఱవూర్ భక్తవత్సలపెరుమాళ్ యెదురుగా సేవసాదించగా “కురుమామణి కున్ఱినై నిన్ఱవూర్ నిత్తిల తొత్తినై”
అని మంగళాశాసనము చేసనారు. 1970లో ఒక నూతన రథాన్ని ప్రారంభించినారు.
పాశురము ~ తిరుమంగై ఆళ్వార్ ~ పెరియ తిరుమొళి ~( 7-10-1):
“పెరుమ్బుఱక్కడలై యడలే ற்ற்త్ తివై ప్పెణ్ణైయాణై; ఎణ్ణిల్ మునివర్ క్కు
అరుళ్ తరున్దవత్తై ముత్తిన్ తిరట్కోవైయై ప్పత్తరావియై నిత్తిలత్తొత్తినై
అరుమ్బినై యలరై యడియేన్ మనత్తాశై యై యుముదమ్బొది యిఞ్జువై
కురుమ్బినై క్కనియై చెన్ఱునాడ