పెరియాళ్వార్ మనకు నేర్పిన తిరుపాదకేశ అనుభవము
Posted by adminNov 21
పెరియాళ్వార్ మనకు నేర్పిన తిరుపాదకేశ అనుభవము 🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శ్రీమతే రామానుజాయ నమః 🙏
మొదటి పాసురములో పెరియాళ్వార్ ,తన తిరుమొழிలో ,కృషపపమాత్ముని , అవతారమునకు పూర్వరంగము తిరుకోష్టియూర్ లో ఎలా జరిగిందో , కన్నయ్య గోకులములో అవతరించిన తరువాత , వారి ఆనందము , అనుభవము , నిశ్చల భక్తిని పాడారు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
రెండవ పాసురములో ఇక పెరుమాళ్ళ దివ్యావయ వర్ణనము చేస్తున్నారు.
తిరుపాద కేశ పర్యంతము !
🌿తిరుపల్లాండులోనే వారు —🌹శెవ్వడి 🌹— అని స్వామి వారి పాదములను పాడారు.
పరమాత్మయందు రుచి ఏర్పడిన తరువాత ,మనలోని రజస్సు, తమస్సులు ,తగ్గి ,సత్వము పెరుగుతుంది . దానితో మనకు పెరుమాళ్ళ మీది ప్రీతి పెరిగిపోయి ,మనకు రక్షకుడైన వారికే రక్షను పెట్టి, మంగళాశాసనము చేయడము జరుగుతుంది. అదే అనునిత్యము ,తిరువారాధన తరువాత , మనము సేవించే తిరు పల్లాండు. 🙏
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
పెరియాళ్వార్ పిళ్ళై తమిழ்
లో యశోదా భావనలో పాడడము మొదలు పెడతారు.
అఖిలాండభువనములనేలే స్వామి ,ఏమీ ఎరుగని బాలుడిలా ,వుయ్యాలలో శయనించి వున్నారు. యశోదాపిరాట్టి ,ఎప్పుడూ ద్వంద్వ భావములో వూగిసవలాడుతూ వుంటుంది. పరాత్పరుడే కన్నయ్య – అని తెలుసు.
కాని మాతృవాత్సల్యము “ ఎన్ శిరికుట్టన్- “అనిపింపజేస్తుంది.
ప్రేమ పాశముచే ,ఆయనకు అన్నీ తానే అయి ,సపర్యలు చేయాలనిపిస్తుంది. తన కు దొరికిన పెన్నిధి స్వామి. ఆయనను ,తానే జాగ్రత్తగా సంరక్షించాలి, అని తల్లడిల్లి, పోతుంది. రక్ష పెడుతుంది.
అది భక్తి పరాకాష్ట. పరమాత్మను మనకు వరాలొసగి ,మనవెతలు తీర్చే వాడిగా గాక , వారిని ,వారికై ప్రేమించి , వారి సౌకర్యముకొరకై , వారి అభీష్టార్థము ,సపర్యలు- కైంకర్యములు చేయడము.
ఈ పాసురము అన్వయించుకొంటే మనకు దక్కేఫలమదే . మార్గదర్శకత్వము. 🙏
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
యశోద కన్నయ్య ఉయ్యాలవద్ద కూర్చొని వారిని సేవించికొంటోంది . అదిగో, తన బుజ్జి బుజ్జి పాదాలను పై కెత్తాడట కన్నయ్య!
ఎప్పుడూ పెరుమాళ్ళ తిరుపాదముల పై భాగమునే గాని ,అరిపాదములను సేవించుకొనే భాగ్యము కలుగదు. త్రివిక్రముడిగా త్రిభువనములను కొలిచి నప్పుడు ,వారు పాదమునెత్తినను , వారి తిరుపాదములు చాలా పెద్దగా ఒక్కోపాదము ఒక్కో భువనమును కొలిచేంత విస్తారముగా నుండి , వాటి పరిపూర్ణ దర్శనమునకు అవకాశమే లేకుండా వుండినది.
ఇదిగో ,ఇప్పుడు కన్నయ్య తన బుజ్జి బుజ్జి పాదాలను పైకెత్తి తన చేతితో పట్టుకొని. , భక్తులందరూ అమృతమని కొనియాడే ఈ పాదపు రుచి ఎట్టిదో ,తానూ చూడాలని, తన పగడములవంటి అధరముల మధ్య పెట్టుకొని – శువైత్తు- ఉణ్ణుం — రసించి ఆస్వాదిస్తున్నారుట. కలకండ తీయదనము మాటలలో తెలియదుగదా, నోటిలోవుంచుకొని రుచి చూస్తేగదా తెలిసేది.
ఆలిలై కణ్ణన్ – తొల్లి ప్రళయకాలములో మఱ్ఱాకుపై శయనించిన భంగిమలో నున్న తన చిన్నారి కన్నయ్యను కనులార్పక సేవించుకొంటోంది యశోద!
తానొక్కర్తి అనుభవించడమేమిటి? అందరు కన్నయ్య దివ్యమంగళరూపమును ఆస్వాదించవద్దూ—- అని ,అనిపించిందా తల్లికి. స్వార్థముతోనో, తన చంటిబిడ్డడికి అందరికన్నులూ తగులుతుందని , స్వార్థపూరితమైన ఆలోచన రాలేదు. అదీ ప్రపన్నుల లక్షణము. అహం- నేను- నాది- నాకు – వుండదక్కడ!
లేచి అందరినీ పిలుస్తోంది. రండర్రా రండి—- వచ్చి చూడండి— కాణీర్ కాణీరే—- అంటూ!
పెరియాళ్వార్ అంటున్నారు , కృష్ణుని కన్నతల్లి లక్ష్మీ సమానురాలుట. శీదక్కడల్- పాలసముద్రములో అమృతముతో పాటు ఆవిర్భవించిన లక్ష్మీపిరాట్టికి – 🌷అన్న- 🌷సమమయిన గొప్పదనమునుగలదైన – దేవకి — యశోదైక్కు పోతంద- యశోదకు అంతటి సమాన గొప్పదనముగలదు- . అలాంటి యశోద , – సాముద్రికలక్షణములూ అంతగొప్పగా వుండాలికదా! అందుకని — – కోదై కుழలాళ్- పూలు ముడుచుకొన్న అందమైన శిరోజములు కలది! పూలు ముడుచుకోవడము – మంగళకరమైన రూపమును సూచిస్తే, నిండైనశిరోజాలు ఆవిడ సౌందర్యమును సూచిస్తుంది, అంతటి అందమైన యశోద, దేవకీదేవి , ఇరువురు గొప్ప తల్లుల ముద్దులపట్టి కన్నయ్య!
పోత్తంద – పేదై కుழవి- కుழవి- శిశువు! పేదై — ఏమీఎరుగని — ముగ్దశిశువు — అలాంటి కన్నయ్య తన కాలివేలుని నోటితో ఆశ్వాదిస్తున్నారు!
పేదై- అని ఎందుకన్నారో— ఆ పదములో ఎన్ని గూఢార్థాలో—- ఆ 🌷🌷తిరుపాదములే మనకు ఆధారము. 🌷మనము శరణాగతి చేయవలసిది ఆతిరువడిగళుక్కే,
🌷తరువాత కైంకర్యము చేయవలసినది -ఆ తిరువడిగళుక్కే—
🌷మనకు ఈసంసారబంధమునుండి ముక్తి ప్రసాదించేదీ ఆ తిరువడిగళే—- 🌷మనలను పరమపదానికి దారిచూపి పిలుచుకొని వెళ్ళేదీ ఆ తిరువడిగళే! 🙏
ఆండాళ్ కూడా తన తిరుప్పావైలో 2– 29 వ పాటలలో ఈ తిరువడినే గదా పాడినది! “ పార్కడలుళ్ పైయ తుయిన్డ్ర – పరమన్- 🌷అడిపాడి🌷మనము మనోఫలకముపై ధరించవలసినది ఆయన తిరువడిగళ్ నే! మనము నిరంతరము ధ్యానము చేయవలసిది – ఆ తిరువడిగళే— పాడవలసినది- ఆ తిరువడిగళ్ నే- — మనకు నిరంతరము రక్షగావుండే ఆ తిరువడిగళ్ కలకాలము క్షేమముగ నుండాలని మంగళాశాసనము చేయవలసిది ఆ తిరువడిగళుక్కే!
అందుకే కన 29 వ పాసురములో “ఒన్ పొర్తామరై – అడియై – పోర్తుం- అని పాడింది ఆండాళ్ తల్లి!
అటువంటి తిరుపాదములు!
పెరియవాచ్చాన్ పిళ్ళై ఇక్కడ అంటారు ! మూడుతామరలు చేరి యశోదను మురిపించిందిట. తిరుక్కై కమలం – కరపద్మములు- తిరువాయ్— అధరకమలములు— తిరుపాదకమలము – ఇలా మూడు కమలములు !!!
పై కెత్తిన ఆ పాదముల అందముమాటలకందనిది! నీలవర్ణము కల , నీలమణినిభ పాదముల పై భాగము , ఎఱ్ఱగా పారాణి అలదినట్లున్న పాదపుటంచులు, పింక్ జాకర్ , అని వజ్రములలోకెల్లా శ్రేష్టమైన లేత గులాబివర్ణపు ఛాయలుగల వజ్రములవలె మెరయు నఖములు , ఇవియన్నియు , తామర పూరేకులవంటి అధరముల మధ్య — ఆ వర్ణకలాపపు అందమును చూసి తరించవలసినదే! ఆ అందమునకు ముగ్ధురాలై యశోద , అందరినీ — పాదకమలంగళ్ కాణీరే—
గోపికలు ఇంకా రావడములేదేంటి- అనే త్వరలో , ఒకసారికాదు , మరల మరల రండి , రండిరండి – అని పిలుస్తాముకదా! అలా మరల వన్దు కాణీరే! – అని పిలుస్తోంది.
ఇక్కడ మానవ సహజమైన మానసిక స్థితిని గుర్తించి ఒక పదప్రయోగము చేసారు పెరియాళ్వార్. సహజంగా గోపికలు చాలా అందగత్తెలు. ఆడవారికి తమ అందముపై కొంచెము అభిమానము ఎక్కువే. నీవెంతఅందంగా వున్నావంటే చాలు , కరిగి పోతారు. అందుకే యశోద మీరందంగా వున్నారు నిజమే అని పిలుస్తోంది. పరమాత్మది తప్ప అందరిది ప్రాకృతిక అందమే. పెరుమాళ్ళ శుద్దసత్వ అప్రాకృత్తిక పంచోపనిషణ్మయ శోభ
వర్ణనా తీతమైనది. అది దర్శించిన వారికే అనుభవము. అందుకే , ఆ అనుభవమును వారూ పొందాలని , అప్పుడు వారిలో వున్న తమ అందముపట్లున్న “ మిడిక్కు” “ అతిశయము—- దానంతటదే తొలగి పోతుందని – యశోదభావములో పాడే పెరియాళ్వారు వారిని పవழవాయీర్— అందమైన పగడాలవంటి ముఖము ( నోరు) గలవారా! అని సంబోధిస్తున్నారు.
ఇలా 2 పత్తు మొదటి పాసురములో తిరుపాదకమలపు అందమును మనకు చూపి , మనలను పరవశులను చేస్తున్నారు. పెరియాళ్వార్ తిరువడిగళే శరణము🙏
అడియేన్
రామానుజదాసి🙏