ధనుర్మాసము
Posted by adminDec 9
*ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ?*
*ధనుర్మాసము* ఒక విశిష్టమైన మాసము (నెల)
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి *చాంద్రమానం* లెక్కిస్తారు. *సూర్యుడు* ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి *సౌరమానాన్ని* లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని *సంక్రమణం* అంటారు .
ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును *సౌరమాసం* అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .
*ధనస్సురాశిలో* ప్రవేశించిన సమయం *ధనుస్సంక్రమణం* . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము *ధనుర్మాసము* అంటారు. మానవులకు *ఒకసంవత్సరం* దేవతలకు *ఒకరోజు* అంటారు . ఈలెక్కన *దక్షిణాయణం* *రాత్రి* *ఉత్తరాయణం* *పగలుగా* భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . *మకరరాశిలో* ప్రవేశించు సమయం *మకరసంక్రమణం* ఇక్కడినుండి *ఉత్తరాయణం* . అనగా . . . పగలుగా భావన . ఇలా భావించినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐన *ధనుర్మాసం* *ప్రాతఃకాలమువలె* *పవిత్రమైనది* . . . *సాత్వికమైన* ఆరాధనలకు ప్రధానమైనది . కనుక *సత్వగుణ* ప్రధానమైన *విష్ణువును* ఈనెలలో *ఆరాధిస్తారు* . . . ఈ నెల *విష్ణుమూర్తికి* *ప్రీతికరమైనది* . *గోదాదేవి* కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘ *పండుగ* *నెలపట్టడం* ‘ అనికూడా అంటారు.
ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా *ముగ్గును* *తీర్చిదిద్దుతారు* . అయితే ఈ ధనుర్మాసం *సౌరమానానికి* సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) *చాంద్రమాన* *అనుయాయులం* . దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో *చంద్రుని* తీర్చిదిద్దుతారు.
కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. *ధనుర్మాసం* కూడా చాలా *ఆధ్యాత్మిక* *ప్రయోజనాలు* కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా *చాలా* *ప్రత్యేకత* ఉంది. *ధనుర్మాసమంతా* .. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. *దీపారాధన* చేయడం వల్ల *మహాలక్ష్మి* *కరుణా* , *కటాక్షాలు* *సిద్ధిస్తాయి* .
ధనుర్మాసం *విష్ణువికి* చాలా *ప్రత్యేకమైనది* . తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. *సుప్రభాతం* బదులు *తిరుప్పావై* గానం చేస్తారు. *విష్ణు* *ఆలయాలల్లో* ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని *బాలభోగం* అంటారు. అలాగే *ధనుర్మాసం* *దేవతలకి* *బ్రాహ్మీ* *ముహూర్తం* *లాంటిది* . ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా *మంచిది* .
ధనుర్మాసం వచ్చిందంటే.. *ఆలయాల్లో* *పండుగ* వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల *వైష్ణవులు* *ధనుర్మాస* *వ్రతం* ఆచరిస్తారు. *గోదాదేవి* ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని *కీర్తించింది* . సూర్యాలయాలు, *వైష్ణవాలయాలు* సందర్శించడం చాలా మంచిది.
*ధనుర్మాసం* *ఫలశ్రుతి*
ఈ ధనుర్మాసంలో *విష్ణుమూర్తిని* మనము ఒక్క రోజు అయిన *మనసా* *వాచ* *కర్మణా* *యదాశక్తిగా* *పూజించిన* యెడల *1000* *యేళ్ళు* విష్ణుమూర్తిని పూజించిన *ఫలితము* కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక *నదిలోకాని* లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య స్థలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన *పుణ్య* *స్థలంలో* ఒక్క మునుగు మునుగిన *4* *రెట్లు* *అశ్వమేధయాగం* చేసిన ఫలితము దక్కును.పవిత్రమైన ఈ ధనుర్మాసాన్ని ధనుర్మాస వ్రత ఆచరణతో పునీతం చేసుకుందాము గోదారంగనాధుల అనుగ్రహం పొందుదాము
*ఆండాళ్* *దివ్య* *తిరువడిగళే* *శరణం*
*శ్రీమతే* *రామానుజాయ* *నమః*
*ప్రేమతో*
*మీ* *కర్పూరం*
*గోపిధర్*
💥🎊🙏👏🌸