పరమపద వాసులు శ్రీ.ఉ.వే. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారి (94)
*⭕అవతార విశేషాలను స్మరించుకుందాం*

జ్ఞాన సముపార్జనకు జన్మాంతర సంస్కారం అవసరం. కాని, ఆరోగ్య సాధనకు సత్వ గుణమే ప్రామాణికం అంటారు డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల శ్రీనివాస రఘునాథాచార్య స్వామి. వేదవేదాంగాలు జీర్ణం చేసుకున్న ఆయన వయసు తొమ్మిది పదుల పైమాటే. వైష్ణవ సంప్రదాయంలో అందరూ గురువులుగా భావించే ముగ్గురు జియ్యర్లు తమ గురువుగా భావించే రఘనాథాచార్య ఇప్పటికీ సత్సంగాలలో పాల్గొంటున్నారు.
వేద జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు..

ఒక వ్యక్తి జ్ఞానసంపన్నుడు కావాలంటే గురువుల అనుగ్రహం కావాలి. భాగవతుల సౌజన్యం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. అదే మనిషి ఆరోగ్యవంతుడు కావాలంటే తల్లిదండ్రుల ఆశీస్సులు కావాల్సిందే. జన్యుశాస్త్ర పరంగా కూడా ఇది రుజువైన విషయమే. అందుకే నా ఆరోగ్యానికి కారణం మా అమ్మానాన్నల అనుగ్రహంగానే భావిస్తాను.

*🔷అమ్మ పెట్టిన ముద్ద..*
తల్లిదండ్రుల వాత్సల్యం, గురువుల దయ, మిత్రుల సౌజన్యం.. ఇవన్నీ మనిషి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నా జీవితంలో ఇవి సమపాళ్లలో కుదిరాయి. అందుకే తొమ్మిదిపదుల వయసులోనూ ఇదిగో ఇలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇందులో ఏది కొరవడినా మానసిక దౌర్బల్యం.. ఆపై శారీరక అనారోగ్యం కలుగుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణ కూడా ప్రధానమైనది. మనలో సత్వ గుణం ఉన్నంత కాలం ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి సత్వ గుణాన్ని పెంచే ఆహారమే తీసుకున్నాను. కారం, చేదు, పులుపు ఇవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. చక్కెర, ఉప్పు కూడా తక్కువ మోతాదులోనే తీసుకునేవాడిని. నా దేహవృద్ధికి మంచి ఆహారం అందించిన మా అమ్మే ప్రధాన కారకురాలు. ఆప్యాయత రంగరించి ఆమె తినిపించిన గోరుముద్దలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి.

*🔷నియమాలతోనే..*
ఆరోగ్యం విషయంలో ఇప్పటికీ చాలా కచ్చితంగా ఉంటాను. ప్రస్తుతం ఉదయం లేవగానే గోరు వెచ్చని హార్లిక్స్‌, పాలు తాగుతాను. అప్పుడప్పుడు కాఫీ. ఉదయం 10.30 గంటలకు కారంలేని పప్పుతో భోజనం. మజ్జిగలో పంచదార లేక అరటి పండు, ఒక స్వీటుతో భోజనం ముగిస్తాను. సాయంత్రం 5 గంటలకు కాఫీ తాగుతాను. రాత్రి 8 గంటలకు మితంగా భోజనం చేస్తాను. భోజన సమయంలో గోరువెచ్చని నీటిని తాగుతాను. అది వేసవికాలమైనా సరే. గంటల తరబడి ధార్మిక ప్రవచనాలు ఇచ్చే సమయాల్లో మిశ్రి కలిపిన నీటితో పెదాలను అద్దుకుంటూ దాహం తీర్చుకుంటాను.

*🔷అష్టాక్షరి అనుగ్రహం..*

మా నాన్నగారు శ్రీనివాసాతాతాచార్య స్వామి మహా పండితుడు. చిన్నప్పుడు నా చెవిలో అష్టాక్షరి మంత్రం చెప్పేవారు. ఎందుకో అర్థం కాక.. ఒక చెవిలో చెప్పగానే.. ‘మరి రెండో చెవిలోనో..’ అంటూ మరో చెవిని చూపేవాడిని. ఆయన ఉపదేశించిన ఆ అష్టాక్షరి మంత్రమే నాకు జ్ఞానభిక్ష ప్రసాదించింది. నాన్నగారి దగ్గర శిష్యరికంలో సంస్కృత, వైష్ణవ సంప్రదాయ గ్రంథాలతో పాటు ఎలా జీవించాలో నేర్చుకున్నాను. న్యాయ వ్యాకరణం, శాసా్త్రభ్యాసం కోసం 14వ ఏట హైదరాబాద్‌లోని సీతరాంబాగ్‌లో ఉన్న సంస్కృత పాఠశాలలో విద్యార్థిగా చేరాను. ఆరేళ్లపాటు సాహిత్య, వ్యాకరణ, తర్క మీమాంస శాసా్త్రలను రామానుజభాష్యంతో సహా అధ్యయనం చేశాను. ఈ క్రమంలో నాపై ఆచార్యులు చూపించిన ప్రేమభిమానాలను మరువలేను. ఆపై నా జీవనయానం అంతా ఆధ్యాత్మిక మార్గంలోనే సాగుతోంది.

*🔷ధార్మిక వ్యాపకం..*

1946 నుంచి వరంగల్‌ శివనగర్‌లో స్థిరనివాసం. ఇక్కడి వైదిక పాఠశాలలో, శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలోనూ సంస్కృత అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ‘సతఃసాంప్రదాయ పరిరక్షణ సభ’, ‘సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్‌’ సంస్థలను స్థాపించి వీటి ద్వారా ‘శ్రీవిష్ణు సహస్రనామ భాష్యం’, ‘ముండకోపనిషత్‌’, ‘కఠోపనిషత్‌’, ‘వేద ప్రామాణ్యము’, ‘శ్రీ భాష్యమునకు తెలుగు వ్యాఖ్యానము’ వంటి 90కి పైగా గ్రంధాలను ప్రచురించారు. ‘శ్రీపాంచరాత్ర ఆగమ పాఠశాల’ ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. శాస్త్ర సంప్రదాయ, సాహిత్య సేవా రంగాల్లో విశేష కృషి చేసిన ముగ్గురు ప్రముఖులకు ప్రతి ఏడాది శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
వారు మన వైష్ణవ సిద్ధాంత దిక్సూచి, అపర ఆచార్యులు మనందరికి మార్గదర్శకులు. వారు ఆచార్య తి‌రువడిని చేరారు అనేది మనందరికి చాలా లోటు. వారి ఆశయం శ్రీవైష్ణవ సిద్ధాంత వ్యాప్తి. ఆదిశగా మనమందరం వారు అందించిన సంప్రదాయ గ్రంథ పఠనం చేద్దాం. అదే వారికి మనమిచ్చే కానుక.
(ఒక మిత్రుడు పంపిన సందేశం ఇది.)
🙏 శ్రీమతే రామానుజాయ నమః🙏
——-+++
ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్ధిక కేసరి మహామహోపాధ్యాయ శ్రీ రఘునాథాచార్య స్వామి వారి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు.
శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా, సంపరాయ పరంపరను కొనసాగిస్తూ జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యుల వారు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారు. ఆజన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి రఘునాథాచార్య స్వామి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
—- CM KCR