వైష్ణవ లక్షణం ఏమిటి
Posted by adminNov 21
వైష్ణవ లక్షణం ఏమిటి
🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻
వైష్ణవ లక్షణం ఏమిటి అని అనేవిషయంలో మణవాళ మాముని గళ్ శిష్యులు , వానమామలై జీయరుకు , చిన్నమ్మాళ్ అనే స్త్రీకి జరిగిన సంభాషణ వివరిస్తుంది. మన సంప్రదాయములో విద్వత్ వరేణ్యులైన సామాన్య స్త్రీలకుకూడా ఎంత ఆదరణ పొందేవారో , తెలిపే సంఘటన!
జీయరు స్వామి కొలనులో స్నామాచరించేటప్పుడు అక్కడకు వచ్చిన ఒక సామాన్య స్త్రీ , చిన్నమ్మ ను కొన్ని ప్రశ్నలు అడిగారు.
1) అమ్మా ! నీకులమేమిటి తల్లీ
చిన్నమ్మాళ్- — నాకులము భాగవత కులము స్వామి🙏
2. ) నీ గోత్ర మేమిటి తల్లీ!
చి।। రామానుజ గోత్రము స్వామి🙏
3. ) నీ సూత్రమేమిటి తల్లి !
చి।। శఠగోప సూత్రము స్వామి
4 ) వేదమేమిటి తల్లి!!
( ఆవిడ ఖంగు తింటుందని అని ముసిముసిగా నవ్వుకొంటూ అడిగారు)
చి।। తమిzha వేదము స్వామి 🙏
(నాలాయిర దివ్య ప్రబంధాన్ని తమిZha వేదమంటారు, ద్రావిడ వేదము)
5)నీ పురుషుడెవరు తల్లీ!!
చి।। పురుషోత్తముడు స్వామి🙏
6) నీ తల్లిదండ్రులు?!!
చి।। పెరుమాళ్, పిరాట్టియార్ 🙏
7. ) బంధులు ?!
చి।। భాగవతోత్తములు స్వామి 🙏
8 ) వృత్తి ఏమిటమ్మా!?
చి।। భాగవత కైంకర్యము స్వామి 🙏
9 ) అమ్మా నీకు దానివల్ల ప్రయోజన మేముటి తల్లీ?!
చి।। అదే ప్రయోజనము స్వామి!! అంతకంటే ఇంక భాగ్యమేముంటుంది స్వామి !! ఆ కైంకర్య భాగ్యాన్ని పొందడా నిర్ తపిస్తుంటాను స్వామి!! ఆ భాగ్యము దొరకడమే ప్రయోజనము!🙏
10 ) నీ వేమన ప్రార్థిస్తావమ్మా? నీకు ఏమి కావాలని , నీ ఏ కోరిక పరిపూర్ణమవ్వాలని?!!
చి।। స్వామి , భాగవత కైంకర్యము చేసే భాగ్యమును పొందాలనేగా నేను కోరుకొనేది స్వామి! ఆ కోరిక తీరి నిరంతరము భాగవత కైంకర్యము చేస్తూ వారికి సంతోషాన్ని, సౌఖ్యాన్నికలిగించే భాగ్యము కలగాలనే ప్రార్థిస్తాను స్వామి!!
జీయరు స్వామి— ఆహా ! ఇదియే కదా వైష్ణవ లక్షణము !
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻