జైగోవింద జైజై భాష్యకార శ్రీమతే రామానుజాయ నమః ప్రియ భగవద్బంధువులకు దాసోహములు
ఈరోజు 108 దివ్య దేశములలో చోళనాడు తిరుపతులలో మెుదటిది అయినటువంటి “శ్రీరంగం ” మూడవ భాగం తెలుసుకుందాం.

శ్లో:కావేరి పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే
  చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే|
  వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే
  దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రజ్గనాధం భజే||

ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారుల కీర్తిస్తారు. మన పెద్దలు ప్రతి దినం “శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ” అని అనుసంధానము చేస్తుంటారు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము

శ్రీరంగం గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది అది “అనంతం”.
ఈనాడు శ్రీరంగం గురించి అక్కడ వేంచేసి ఉన్న సమస్త అర్చామ్మూర్తులకు మూలమైన రంగనాధ పెరుమాళ్ గురించి కొన్ని విశేషాలు చూద్దాము.

అసలు స్వామీ అక్కడకు వేంచేయడానికి సంభందించిన వృత్తాన్తమ్ చూద్దాము.

రంగనాధుడే అన్ని అర్చామూర్తులకు మూలమైనవాడు అంటున్నాము కదా!అదేంటి అలా అనడంలో అర్ధం ఏంటి తిరుమల శ్రినివాసుడినో?లేదా  మరిఒక దివ్యదేశంలో ఉండే స్వామిని ఎందుకు కాకూడదు అంటే?మొట్టమొదటిగా విగ్రహరూపంలో ఈ భూలోకంలో ఆవిర్భవించనవారు పాలకడలిలో ఉండే స్వరూపంతోటి మొదటగా వేంచేసినవారు  రంగనాధుడు కాబట్టి వారే ప్రధములు,వారే మూలము.

పరమాత్మ సృష్టి చెయ్యాలని సంకల్పించిన తరవాత మొదటగా చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మకు సృష్టి చేయుటకు కావాల్సిన జ్ఞానాన్ని సహకారికములను అన్ని ఇవ్వగా,బ్రహ్మ తాను నిత్యం ఆరాధించుకోవడానికి ఒక అర్చామూర్తిని ఇవ్వమని ప్రార్ధించగా, అంతట స్వామి ఐదు తలల ఆదిశేషుడిపై శయనించిన శ్రీరంగనాథుని విగ్రహాన్ని శ్రీరంగవిమానంతో బ్రహ్మకు బహుకరిస్తారు. సత్యలోకంలో దానిని ప్రతిష్టించి అప్పటినుండి బ్రహ్మ రంగనాధుడిని భక్తి శ్రద్దలతో పూజించేవారు. బ్రహ్మ గారు అర్చామూర్తికి ఎటువంటి అపచారములు జరగకుండా చూసుకునే భాద్యతను సూర్యునకు అప్పగించి ఆరాధనలు జరిగేవి.బ్రహ్మగారి  కుమారుడు మనువు కూడా తరవాతి పరంపరలో రంగనాధుడిని ఆరాధించేవారు. మనువు కుమారుడగు ఇక్ష్వాకు శ్రీమన్నారాయణుడి పరమ భక్తుడు. అతడు ఎలాగైనా సరే శ్రీరంగవిమానాన్ని సంపాదించి భూలోకంలో తన నివాస స్థలంలో ప్రతిష్టించి తలచి బ్రహ్మగారి గురించి కఠోర తపస్సు చెయ్యగా,ఇంతలో బ్రహ్మ గారు ప్రత్యక్షం అవ్వగానే తన కోరికను విన్నవించగా, శ్రీమన్నారాయణుడు కూడా ప్రత్యక్షమై రిక్షావాకు కోరికను మన్నించి,శ్రీరంగ విమానాన్ని ఇవ్వమని చెప్పగా,బ్రహ్మ తాని శ్రీరంగడుని విడిచి ఉండలేనని చెబుతాడు. శ్రీమన్నారాయణుడు ఇలా బ్రహ్మను కటాక్షిస్తారు ” తాను సరియు నదీతీరంలో అయోధ్యలో ఉనంతవరకు బ్రహ్మను ప్రాతఃకాలమున అర్చించమని, తాను శ్రీరంగమునకు వెళ్లిన తరువాత మాంద్యానిక సమయములో ఆరాధించామని”చెప్పగా, అందుకు బ్రహ్మ సరేనని శ్రీరంగవిమానంతో సహా శ్రీరంగనాధుడిని ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తారు. ఇలా భూలోకమునకు వేంచేసిన రంగనాధుడు శ్రీరామచంద్రుని వరకు సూర్యవంశపు రాజుల యొక్క ఆరాధనను స్వీకరిస్తాడు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో అందరికి అన్ని కానుకలు ఇవ్వగా,రాముడిని విడిచి వెళ్లలేని స్థితిలో ఉన్న విభీషనుడికి రాముడు వారి ఆరాధ్యదైవమైన రానగనాధుడిని బహుకరిస్తారు. అత్యంత ఆనందముతో విభీషణుడు ఆ రంగ విమానాన్ని తన శిరస్సుపై దాల్చి తన లంకకు పయనం అవ్వగా, ఉభయ కావేరుల మధ్య స్థావరమునకు రాగానే మాధ్యాహ్న సమయం అయినందున నిత్యానుష్టానులు చేయదలచి శ్రీరంగ విమానమును చంద్రపుష్కరిణి సమీపంలో  రమణీయమైన స్థానంలో ఉంచి తాను సంధ్యావందనాదులు చేయుటకు వెళ్లెను . అదే “శేషపీఠం”. అనుష్టానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చి చుసిన విభీషనుడికి రంగనాధుడు అక్కడ సుప్రతిష్ఠమైనట్టుగా తెలిసి అత్యంత విచారం పొందాడు. విభీషణుడి బాధను చుసిన స్వామి సాక్షత్కారం ఇచ్చి నీవు చింతించవలదు,భక్తుల యొక్క ప్రార్ధన మేరకు నేను ఇక్కడ వేంచేసితిని,అని తెలిపి నీవు నిత్యమూ రాత్రి వేళల వచ్చి నన్ను ఆరాధించుకో స్వీకరిస్తాను అని అభయం ఇచ్చాడు.

స్వామి ఈ ప్రాంతంలోనే ఎందుకు సుప్రతిష్ఠుడైయ్యాడు?అని అంటే.

అయోధ్యలో పూర్వం దశరథమహారాజుగారు పుత్రకామేష్టి యాగం చేస్తున్న సమయంలో ఆ యాగాన్ని దర్శించడానికి వచినటువంటి మహారాజులలో ఒకరైన చోళదేశాన్ని పాలిస్తున్న ధర్మవర్మ అనేటువంటి మహారాజు కూడా వచ్చాడు. ఆ యాగ శాల యందు వేంచేసి ఉన్నటువంటి శ్రీరంగవిమానాన్ని చూసి అత్యంత ప్రీతికలిగినవాడై ఆ స్వామిని తన నివాసస్థానములో ఉంచుకుని అత్యంత భక్తిశ్రద్దలతో ఆరాధించాలనుకున్నాడు. ఆ కోరికటి ధర్మవర్మ మహారాజు చంద్రపుష్కరిణి తీరంలో స్వామిని గూర్చి తపస్సు చెయ్యడం ప్రారంభించగా, మహర్షులు ధర్మవర్మతో ఇలా చెప్పసాగారు అతితొందరలో శ్రీరంగనాథుడు తన నివాస ప్రదేశమునకు శ్రీరంగవిమానముతో సహా వేంచేస్తునాడు అని తెలపగా,అత్యంత ఆనందభరితుడై స్వామి ఈ దీనుడిని కటాక్షించారు అని పొంగిపోయి.అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీరంగవిమానమునకు చుట్టూ ప్రాకారములు ఏర్పరిచి నిత్యా పూజాదికములు క్రమంతప్పకుండా నిర్వహిస్తూ తరించారు.
ధర్మవర్మ మహారాజు తరువాతి పరంపరలో వచినటువంటి వారు అత్యంత రమణీయంగా గోపుర ప్రాకారాదులు నిర్మింప చేశారు.కానీ కొంత కాలం పరంపర లేకుండా ప్రకృతి యొక్క భీబత్సం చే కప్పబడి ఒక దండకారణ్యమునకు నివాసముగా అయిపోయింది. తరవాత చోళరాజ్య పరంపరలో ఉన్నటువంటి రాజుకు ఒక చిలుక యొక్క వాక్కులచేత రంగనాధడిని వైభవాన్నిశ్లోక రూపంగా  వింటూ

“శ్రీ ధర్మ వర్మ రవివర్మ నిషేవితాజ్గ:
  శ్రీరజ్గిణీ చటుల విభ్రమ లోల నేత్ర: |
  నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి
  పాత్రం విరాజితి విభీషణ భాగధేయ: ||”

ఆ శబ్దముద్వారా ప్రయాణిస్తూ రంగనాధుడు తన స్వప్నంలో చూపించనట్టి చోటుకు చేరుకొని చింతించి తిరిగి పునరుద్ధరణ చేశారు.ఇలా స్వామి భూలోకంలోకి వేంచేసి మనందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా మొదట చతుర్ముఖుని ఆరాధనగా ఉన్న శ్రీరంగనాధుడు మన భాగ్యవిశేషంచేత ఉభయ కావేరుల నడుమ శయనించారు.సప్త ప్రాకారాలతో విలసిల్లే దివ్యధామం. ఏడు ప్రాకారాలు ఏడు ఊర్ధ్వలోకములుగా చెబుతారు మన పూర్వాచార్యులు.
గర్భాలయంలో వేంచేసి ఉన్న స్వామిని “పెరియ పెరుమాళ్” అని తిరునామం.అమ్మవారు శ్రీరంగనాయకి. ఉత్సవమూర్తికి “నుమ్బెరుమాళ్”అని తిరునామం. శ్రీ రంగనాధుడిని ఆళ్వార్లు కీర్తించినటువంటి కొన్ని పాశురాలను చూద్దాము.

ఒన్ఱు మఱన్దఱియే నోదనీర్ వణ్ణనై నాన్
  ఇన్ఱు మరప్పవో వేழனకాళ్-అన్ఱు
  కరువరజ్గత్తుట్కిడన్దు కైతొழுదేన్ కణ్ణేన్
  తిరువరబ్గ మేయాన్ తిశై.
         పొయిగై ఆళ్వార్-ముదల్ తిరువన్దాది.6

 మనత్తుళ్ళాన్ వేజ్గడత్తాన్ మాకడలాన్ మట్రుమ్‌
  నినైప్పరియ వీళరజ్గత్తుళ్ళాన్-ఎనైప్పలరుమ్‌
  దేవాది దేవనెనప్పడువాన్; మున్నొరునాళ్
  మావాయ్ పిళంద మగన్.
        పూదత్తాళ్వార్-ఇరండాంతిరువన్దాది.28

  విణ్ణ గరం వెకా విరితిరై నీర్ వేజ్గడమ్‌
  మణ్ణకరమ్ మామాడ వేళుక్కై;-మణ్ణగత్త
  తెన్ కుడన్దై తేవార్‌తిరువరజ్గమ్ తెంకోట్టి;
  తన్ కుడజ్గై నీరేறாన్ తాழవు.
        పేయాళ్వార్-మూన్ఱాం తిరువన్దాది.62

  కొణ్డై కొణ్డ కోదై మీదు తేనులావు కూనికూన్
  ఉణ్ణై కొణ్ణ రజ్గవోట్టి యుళ్ మగిழన్ద నాదనూర్
  నణ్డై యుణ్డు నారై పేర వాళపాయ ;నీలమే
  అణ్డై కొణ్డు కెణ్డై మేయు మన్దణీరరజ్గమే.
             తిరుమழிశై ఆళ్వార్ తిరుచ్చన్ద విరుత్తమ్‌.49

 కజ్గులు మ్పగలు జ్కణ్డుయి లఱియాళ్ కణ్ణనీర్ కై గళాలిఱైక్కుమ్;
  శబ్గు శక్కరజ్గళెన్ఱు కైకూప్పుమ్‌ తామరైక్కణ్ణెన్ఱే తళరుమ్,
  ఎజ్గనే తరిక్కేనున్నై విట్టెన్ను మిరునిలజ్కై తழாవిరుక్కుమ్‌
  శెజ్గయల్ పాయ్‌నీర్ త్తిరువరజ్గత్తా యివళ్ తిఱతైన్ శెయ్‌గిన్ఱాయే||
           నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-2-1

  ఇరుళిరియ చ్చుడర్ మణిక ళిమైక్కుమ్‌ నెట్రి
  యినత్తుత్తియణి పణమాయిరజ్గళార్‌న్ద
  అరవరశ ప్పెరుమ్‌జోది యనన్దనెన్ను
  మణివిళబ్గు మయర్ వైళ్ళె యణై యై మేవి;
  త్తిరువరజ్గ ప్పెరునగరుళ్ తెణ్ణీర్పొన్ని
  తిరైక్కైయా లడివరుడ ప్పళ్ళికొళ్ళుం
  కరుమణియై క్కోమళత్తై క్కణ్డుకొణ్డు
  ఎన్ కణ్ణిణైగ ళెన్ఱుకొలో కళిక్కునాళే.
          కులశేఖరఆళ్వార్-పెరుమాళ్‌తిరుమొழி 1-1-1

  మాదవత్తోన్ పుత్తిరన్ పోయ్ మఱి కడల్వాయ్ మాణ్డానై
  ఓదువిత్త తక్కణైయా వురువురువే కొడుత్తానూర్‌
  తోదవత్తి త్తూయ్‌మఱై యోర్ తుఱై పడియ త్తుళుమ్బియెజ్గుమ్‌
  పోదిల్‌వైత్త తేన్ శొరియుం పునలరజ్గ మెన్బదువే.
              పెరియాళ్వార్-పెరియాళ్వార్ తిరుమొழி 4-8-1

  పొజ్దోదం శూழన్ద పువనియుం విణ్ణులగమ్‌
  అజ్గాదుమ్‌ శోరామే యాళ్ గిన్ఱ వెమ్బెరుమాన్‌
  శెజ్గోలుడైయ తిరువరజ్గచ్చెల్వనార్‌
  ఎజ్గోల్ వళైయా లిడర్ తీర్వ రాగాదే.
         ఆండాళ్ నాచ్చియార్ తిరుమొழி 11-త్రీ

  పచ్చై మామలై పోల్ మేని పవళవాయ్ కమల చ్చెజ్గణ్‌
  అచ్చుదా అమరరేఱే ఆయర్ తమ్‌ కొలిన్దే యెన్ఱుమ్‌
  ఇచ్చువై తవిర యాన్‌పోయ్ ఇన్దిరలోకమాళుమ్‌
  అచ్చువై పెఱినుం వేణ్డేన్ అరజ్గమానగరుళానే.
            తొణ్డరడిప్పొడియాళ్వార్-తిరుమాలై

అమల నాదిపిరాన్ అడియార్కు ఎన్నై ఆట్పడుత్త
  విమలన్;విణ్ణవర్ కోన్ విరై యార్ పొழிల్ వేజ్గడవన్;
  నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్ మదిళరజ్గత్తమ్మాన్-
  తిరుక్కమల పాదం వన్దు ఎన్ కణ్ణి నుళ్ళన వొక్కిన్ఱదే.
            తిరుప్పాణి ఆళ్వార్ అమలనాదిపిరాన్-౧

తుళజ్గునీణ్ముడి యరశర్ దమ్‌కురిశిల్ తొణ్డైమన్నవన్ తిణ్డఱలొరువఱ్కు;
  ఉళజ్గొళన్చి నోడిన్నరుళ్ శురన్ద జ్గొడునాழிగై యేழுడనిరుప్ప;
  వళజ్గొళ్ మన్దిరం మట్రవ ర్కరుళిచ్చెయ్‌దవా ఱడియే నఱిన్దు; ఉలగ
  మళన్ద పొన్నడియే యడైన్దుయ్‌న్దే నణిపొழிల్ తిరువరజ్గత్తామ్మామే||
            తిరుమంగై ఆళ్వార్ పెరియ-తి.మొ. 5-8-9

వాళి తిరునామాలు


తిరుమగళుమ్‌ మణ్ముగళుమ్‌ శిఱక్కవన్దోన్ వాழிయే
  శెయ్యవిడై త్తాయ్‌ మగళావ్ శేవిప్పోన్ వాழிయే
  ఇరువిశుమ్చిల్ వీత్తిరుక్కు మిమైయవర్‌కోన్ వాழிయే
  ఇడర్ కడియ ప్పాఱ్కడలై యెయ్‌దినాన్ వాழிయే
  అరియ తయరదన్ మగనా యవదిరిత్తాన్ వాழிయే
  అన్దరియామిత్తువము మాయినాన్ వాழிయే
  పెరుగి వరుం పొన్ని నడుప్పిన్ తుయిన్దాన్ వాழிయే
  పెరియ పెరుమాళెజ్గళ్ పిరానడిగళ్ వాழிయే.
   రేపటి రోజు శ్రీరంగం నాలుగవ భాగం తెలుసుకుందాం

అడియేన్ రామానుజ దాసన్