రామాయణం .1..
      (ప్రారంభం)

రామాయణం!! ఆ పేరు చెవిన పడగానే అంతులేని శక్తీ ఎక్కడినుండో వస్తుంది…… ..
మహర్షివాల్మికివ్రాసినఒకఉత్తమోత్తమమానవుడిజీవనయానం ,..
ఒక ఉదాత్తమయినచరిత్ర….

పితృవాక్యపాలనం… ,సోదరప్రేమ… ,ఏకపత్నీవ్రతం… ,ప్రజారంజక పరిపాలన… ,స్నేహధర్మం….,సేవానిరతి….,రాజనీతి…,
ఇలా ఒక్కొక్క విషయము గూర్చి వింటుంటే గుండె లోతులను ఎక్కడో తడుతూ ఉంటుంది …….
రామాయణం హృదయ సంబంధి…అంటే రామాయణం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఎదో ఒక మూల తెలియని కదలికలు వస్తుంటాయి..
అదే మహా భారతం చూసినట్లయితే మన మేదోవికాసానికి కావలసిన సామాగ్రి అంతా దొరుకుతుంది

…yes !
RAAMAAYAN TOUCHES OUR SOUL ,
MAHABHAARATH TOUCHES OUR MIND!!

ప్రతినాయకుడి పక్షంనుండి నాయకుడి ప్రశంస ఏ వాజ్మయంలో ఉంది ?…….
రామో విగ్రహవాన్ ధర్మః  …….
అంటే  ధర్మాన్ని కనుక కరగించి మూస పోస్తే అది తాల్చే ఆకారం “శ్రీ రాముడు “.
ఈ మాటలు మారీచుడు రావణాసురుడితో అంటాడు !.
శ్రీ రాముడి గుణగణాలగురించి మనకు అయోధ్యాకాండలో కనపడుతుంది …….
బుద్ధిమాన్ ,మధురాభాషీ,పూర్వభాషీ ,ప్రియంవదః
వీర్యవాన్ న చ వీర్యేణ మహాతాస్వేన విస్మితః.
ప్రశస్తమైన బుద్ది గలవాడు ,మధురముగా అంటే తియ్యగా మాట్లాడేవాడు ,
చక్రవర్తి తనయుడు, మహాదానుష్కుడు, సంపద లోను
శౌర్యం లోను తనతో తులతూగ గలిగే వాడు లేడు…
అయినా  కించిత్ గర్వం లేకుండా తానే అందరినీముందుగాపలకరిస్తాడు ,
శత్రువులవిషయంలోగూడాప్రియవచనాలేపలుకుతాడు …...
రాముని గుణాలు ఇవి అని ఏమి చెప్పగలం? సకల సుగుణాభిరాముడు,
లోకంలోని సద్గుణాలన్నీ ఒక చోట చేరి రూపం దాలిస్తే ఆ రూపమే శ్రీ రాముడు ..
ఏ విధమైన ఆలోచన లేకుండా మనం నిత్యం ఎన్నో తప్పులు చేస్తుంటాం ,ఒక జీవనకాలంలో లెక్క వేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది ..
అదే మన పిల్లలకు రామాయణ పారాయణం అలవాటు చేసి రామకధచెప్పవలసినవిధంగాచెపితే …...
రామకధాసుధారససారం రంగరించి వారి ఉగ్గుపాలలో పోసి పెంచితే!.
జీవన గమనంలో వచ్చే ఆటు పోట్లు ఎదుర్కొనే శక్తీ లభించడమే గాకుండా, జీవితంలో తప్పులు, పొరపాట్లు    దొర్లినప్పుడు దిద్దుకునే ధీశక్తి లభిస్తుంది. …….
Sir William Jones  అనే ఒక బ్రిటిష్ విద్యావేత్త 18వ శతాబ్దంలోనే  ఈవిధంగా అంటాడు..
” భారత దేశం నుండి ఆంగ్లేయులు తెచ్చుకోవలసిన నిజమైన సంపద రామాయణమే ! .
ఎందుకంటే మనిషి మనిషి గా జీవించే సరళమైన హృద్యమైన విధానం నేర్పుతుంది గనుక! “.
వందే వాల్మీకి కొకిలం !!!!

🙏🏻🙏🏻🙏🏻🙏🏻